TG: తెలంగాణ పోలీసుల మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు అలాగే పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బిఆర్ఎస్ నేతలను అరెస్టు చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే పాడి కౌశిక్ రెడ్డి పై కూడా కేసు నమోదు కావడంతో మాజీ మంత్రి హరీష్ రావు కౌశిక్ రెడ్డి తో మాట్లాడటం కోసం ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలోనే పోలీసులు వీరిద్దరిని విడివిడిగా అరెస్టు చేసి జైలుకు తరలించారు.
హరీష్ రావును అక్రమంగా అరెస్టు చేసి, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కి తరలించడంతో బిఆర్ఎస్ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పోలీసులు అరెస్టు చేయడంతో హరీష్ రావు మాట్లాడుతూ పోలీసుల తీరుపై అలాగే ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారన్న హరీశ్‌రావు.. ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కి వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేయగా తీవ్రంగా ఖండించారు.
ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన కంప్లైంట్ రాసేందుకు వెనకాడతారు, పైగా ఆయనపైనే కేసు రాస్తారు అంటూ మండిపడ్డారు. ఇదెక్కడి న్యాయం ఇదెక్కడి విడ్డూరం ఇదేనా మీ రేవంత్ రెడ్డి మార్కు పాలన అంటూ వరుస ప్రశ్నలు వేశారు. రాజ్యాంగాన్ని కాపాడుదామని రాహుల్‌గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. నువ్వేమో తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూనే ఉంటావు. ప్రజల తరపున పోరాటం చేస్తున్న BRS నేతలపై అక్రమ కేసులు పెడతామంటే ఏ మాత్రం భయపడమని ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.