TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. నిన్న ఈయన దిల్ రాజుతో భేటీ అయిన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ మీడియా సమావేశంలో భాగంగా ఈయనకు అల్లు అర్జున్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పూర్తిస్థాయిలో అల్లు అర్జున్ ది తప్పు అన్నట్టుగా మాట్లాడారు. ఈ ఘటన తర్వాత అక్కడ మానవతా దృక్పథం లోపించినట్టు స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. బాధితరాలు మరణించిన తర్వాత కనీసం అల్లు అర్జున్ లేదా అతని టీం అయినా వారిని పరామర్శించి రావాల్సిందని తెలిపారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సరైన నిర్ణయం తీసుకున్నారని పోలీసులు కూడా వారి పని వారు చేశారని పవన్ తెలిపారు.
ఇక ఈ ఘటనలో రేవంత్ రెడ్డి స్థానంలో నేను ఉన్నా కూడా అదే చేసేవాడిని. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లే బన్నీనుఅరెస్టు చేశారు అనడం సరైనది కాదు. రేవంత్ స్థాయి అదికాదు ఆయన ఒక గొప్ప నాయకుడు అంటూ రేవంత్ రెడ్డి పై ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేవంత్ గురించి పెద్ద ఎత్తున పొగడ్తలు కురిపించారు అసలు ఏ యాంగిల్ లో రేవంత్ రెడ్డి తనకు గొప్పగా కనిపించారు అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి విషయంలో ఆయనకు ఎందుకు గ్రేట్ అనిపించిందో అర్థం కావడం లేదని తెలిపారు.తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయనందుకు నచ్చారా అని పవన్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. గతంలో అల్లు అర్డున్ పై రేవంత్ రెడ్డి సర్కార్ చర్యల్ని బీజేపీ తప్పుబట్టింది. ఇప్పుడు అదే రేవంత్ ను పవన్ ప్రశంసించడం పట్ల బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
