TG: ఫోన్ టాపింగ్ కేసులో హరీష్ రావును అరెస్టు చేయొద్దు… హై కోర్టు సంచలన తీర్పు!

TG: ఫోన్ టాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావును అరెస్టు చేయొద్దు అంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అదేవిధంగా ఈ వ్యవహారంలో పోలీసులకు పూర్తిగా సహకరించాలి అంటూ హరీష్ రావుకి కూడా ఆదేశాలను జారీచేసింది. ఫోన్ టైపింగ్ వ్యవహారం గురించి సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు హరీష్ రావు పై డిసెంబర్ మూడో తేదీ కేసు నమోదు అయింది.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది.హరీష్ రావుతో పాటు అప్పట్లో ఇంటలిజెన్స్ లో పనిచేసిన రాధాకిషన్ రావుపై ఆయన ఆరోపణలు చేశారు. వీటిపై బంజారాహిల్స్ పోలీసులు ఈ ఏడాది నవంబర్ 18న చక్రధర్ గౌడ్ వద్ద సమాచారం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తన వద్ద ఉన్న ఆధారాలను కూడా చక్రధర్ పోలీసులకు అందజేశారు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసుపై హైకోర్టులో హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఆయనను ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అరెస్టు చేయకూడదని, ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని హరీష్ రావును కూడా హెచ్చరించింది. అయితే బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో భారీ స్థాయిలో ఫోన్ టాపింగ్ జరిగింది అంటూ రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇక 2023 ఎన్నికలలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారపై విచారణ కూడా జరుగుతుంది. ఈ విచారణలో భాగంగా ఎన్నో నిజానిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో అప్పట్లో ఎస్ఐబీలో ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావుపై ఆరోపణలున్నాయి. ప్రస్తుత అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును ఎలాగైనా ఇండియాకు రప్పించాలని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.