కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పిసిసి కన్నెర్రజేసింది. ఎన్నికల వేళ క్రమశిక్షణ లేకుండా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించింది. రెండు రోజుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లపై వివరణ ఇవ్వాలని పిసిసి క్రమశిక్షణా సంఘం తాఖీదు పంపింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం తన అనుచరుల మీటింగ్ ఏర్పాటు చేసుకుని పిసిసి ఇన్ఛార్జి రామచంద్ర కుంతియాపై విరుచుకుపడ్డారు. కుంతియా ఎవడు అంటూ ఘాటుగా మాట్లాడారు. కుంతియా తెలంగాణకు శనిలా దాపురించిండని విమర్శించారు. కుంతియాకు నేను భయపడాల్నా అని హెచ్చరించారు. వంద మంది కుంతియాలు వచ్చినా నేను భయపడను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్రోకర్ నా కొడుకులకు పార్టీ కమిటీల్లో పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు. టివిల ముందు, పేపర్ల ముందు మాట్లాడే వారికి పదవులు కట్టబెట్టారని విమర్శించారు. తనను వందలసార్లు పార్టీ అవమానించిందన్నారు. తనను పక్కనపెట్టడంలో ఆంతర్యమేమని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో అధిష్టానంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు చేశారన్న కోణంలో పిసిసి క్రమశిక్షణా సంఘం నోటీసు జారీ చేసింది. రెండు రోజుల్లో రిప్లై ఇవ్వాలని సూచించింది. పిిసిసి జారీ చేసిన నోటీసు కింద ఉంది చూడండి.