Telangana: తెలంగాణలో ఇటీవల వరుస ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలా గురుకుల హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్థుల భోజనంలో పురుగులు రావడమే కాకుండా పూర్తిగా ఆహారం కూడా కలుషితం కావడంతో ఈ విషయం తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది. అయితే ఈ విషయంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు మరణిస్తున్న రేవంత్ రెడ్డి మేల్కొనకుండా మతిస్థిమితం లేని కొండా సురేఖ లాంటి వారితో మాట్లాడిస్తున్నారని ఈయన మండిపడ్డారు. కొండా సురేఖ వ్యవహారాలు వరంగల్ ప్రజలు మొత్తానికి తెలుసని ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ‘గురుకులాల బాట’ కార్యక్రమం వివరాలు శనివారం వెల్లడించారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్‌తో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో గురుకుల విద్యావ్యవస్థ కుప్పకూలిందని చెప్పారు. కెసిఆర్ హయామంలో గురుకులాలు ఎంతో అద్భుతంగా ఉండేవని ఈయన తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే జిల్లాలో మూడు గురుకుల పాఠశాలలలో ఆహారం కలుషితం ఏర్పడింది. 28 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక గురుకులాలలో చదువులు చెప్పే టీచర్లకు గత ఆరు నెలలుగా జీతాలు రావడంలేదని సమస్యలన్నింటిని వరుసగా బయటపెట్టారు. ఇలా కేటీఆర్ పిలుపు మేరకు గురుకుల బాటకు వచ్చామని ఇలా గురుకుల బాట కార్యక్రమంతో కాంగ్రెస్ లో భయం పుట్టిందని ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఇటీవల ప్రవీణ్ కుమార్ గురించి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై కూడా ఈయన మాట్లాడారు విద్యాశాఖ పై రేవంత్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదు అందుకే మతిస్థిమితం లేని కొండా సురేఖ వంటి మంత్రులతో మాట్లాడిస్తున్నారు కొండా సురేఖ సంస్కారం లేకుండా మాట్లాడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు ఆమె ఆ పదవికి పూర్తిగా అనర్హురాలు అంటూ ఈయన కొండా సురేఖ పై కూడా మండిపడ్డారు.