Telangana: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మరోసారి హైకోర్టులో తీవ్ర నిరాశ ఎదురయింది. ఈయనకు కొడంగల్ కోర్టు రిమాండ్ ను విధిస్తూ ఇటీవల తీర్పును వెల్లడించింది అయితే ఈయన మాత్రం హైకోర్టును ఆశ్రయిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే గత పది రోజుల క్రితం ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం తాజాగా ఈ పిటీషన్ కొట్టి వేస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో ఈయనకు భారీ షాక్ తగిలిందని చెప్పాలి.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యేగా ఈయన లగచర్ల గ్రామ ఘటనలో A1 ముద్దాయిగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లగచర్ల గ్రామం పరిధిలో ఫార్మసిటీ ఏర్పాటు కోసం భూసేకరణ ప్రారంభించింది అయితే ఈ భూ సేకరణలో భాగంగా అధికారులు గ్రామంలోకి వెళ్లడంతో ఒకసారిగా గ్రామస్తులు అధికారులపై అలాగే కలెక్టర్ పై కూడా దాడి చేశారు.
ఇలా అధికారులపై దాడి జరగడంతో ఈ దాడి వెనుక తప్పనిసరిగా బిఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఉందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది ఈ క్రమంలోనే ఈ ఘటనలో ఏ1 ముద్దాయిగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఏ 2 ముద్దాయిగా భోగమోని సురేష్ ను ప్రకటించింది.కేసులో ఏ1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రధాన కుట్రదారుడని పోలీసులు, ప్రభుత్వం తరఫు న్యాయవాది పల్లె నాగేశ్వర్‌రావు కోర్టుకు తెలిపారు ఈ ఘటనలో సురేష్ నరేందర్ రెడ్డి కి ఏకంగా 89 సార్లు ఫోన్లో మాట్లాడారని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే నిందితులు కలెక్టర్ సహా ఇతర అధికారులను హత్య చేయాలనే కుట్రతో దాడి చేశారని కోర్టు విన్నవించారు. దాడికి కుట్రలో నరేందర్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని అన్ని దర్యాప్తులలో ఈ విషయాలన్నీ ఆధారాలతో సహా బయటపడతాయని అంతవరకు ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవద్దని కోరారు. తాజాగా, ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కోర్టు కొట్టి వేసింది.