మహేష్ కు కేసీఆర్ గిప్ట్ ఇది

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి’ఎల్లుండి రిలీజ్ కు రెడీ అవుతోంది. మహేష్ బాబు ఇరవై ఐదవ సినిమాగా ‘మహర్షి’ రూపొందింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ పాత్ర పోషించారు. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు కూడా ఆకట్టుకున్నాయి. మే 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

ఈ నేఫద్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా ఐదు షోలకు అనుమతి ఇచ్చింది. దీంతో మే 9 నుంచి మే 22 వరకు ఐదు షోలను ప్రదర్శించబోతున్నారు. దాంతో ఈ సినిమా కు భారీగా బూస్ట్ ఇచ్చినట్లైంది. మహేష్ కు కేసీఆర్ ఇచ్చిన గిప్ట్ ఇది అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రశంసలు వర్షం కురిపిస్తన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏ పెద్ద సినిమాకీ స్పెషల్ షోలకు పర్మిషన్స్ తెలంగాణాలో ఇవ్వటం జరగలేదు.

మరో ప్రక్క ఈ సినిమా టికెట్‌ ధరలను పెంచారు. హైదరాబాద్‌లోని పలు థియేటర్లలో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.80 టికెట్‌ ధరను రూ.110కి పెంచారు. మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచారు. ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో రూ.138 ఉన్న టికెట్‌ ధరను రూ.200కి పెంచారు. ప్రభుత్వం అనుమతితోనే ధరలు పెంచినట్లు యాజమాన్యాలు పేర్కొన్నాయి. రెండు వారాలపాటు ఈ ధరలు అమలులో ఉంటాయని తెలిపారు.