మునుగోడులో టీడీపీ ఆ పార్టీకి మద్దతు ఇవ్వనుందా.. ఏ పార్టీ వైపు అంటే?

తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు నియోజకవర్గానికి వచ్చే నెలలో ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది. అయితే తెలంగాణలో ప్రస్తుతం పెద్దగా ప్రభావం చూపే పార్టీ కాకపోయినా ఆ పార్టీని కూడా అంతోఇంతో అభిమానించే వాళ్లు ఉన్నారు. మునుగోడు ఉపఎన్నిక బరిలో ఉండాలా లేదా అనే విషయాన్ని టీడీపీ ఇంకా తేల్చుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రస్తుతం మునుగోడులో టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. స్థానిక పరిస్థితులను బట్టి పార్టీ పార్టీ నిర్ణయం తీసుకోవాలని టీడీపీ భావిస్తోంది. అయితే టీడీపీ మరో పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి టీ.ఆర్.ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని అనుకున్నా ఆ పార్టీ టీడీపీ మద్దతు తీసుకోవడానికి ఇష్టపడదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో టీడీపీ మద్దతు కోరే పార్టీ ఏదో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. అయితే కాంగ్రెస్ కు టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి.

మునుగోడు ఉపఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే కావడంతో బీజేపీ, కాంగ్రెస్ లలో ఏదో ఒక పార్టీకి టీడీపీ మద్దతు ఇచ్చి ఆ పార్టీని గెలిపించడానికి తమ వంతు కృషి చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు మునుగోడు ఉపఎన్నిక దేశంలోనే ఖరీదైన ఉపఎన్నిక కానుందని బోగట్టా. ఒక పార్టీ ఓటుకు 40 వేల రేంజ్ లో మరో పార్టీ ఓటుకు 30 వేల రేంజ్ లో ఇవ్వనుందని తెలుస్తోంది.

కాంగ్రెస్ మాత్రం ఈ రేంజ్ లో ఖర్చు చేయలేక ఓట్ల కొనుగోలు విషయంలో వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు జరగడానికి మరో మూడు వారాల సమయం ఉన్న నేపథ్యంలో ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. బీజేపీ ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ ఉందని ఎక్కువమంది భావిస్తున్నారు.