SLBC Tunnel Accident: టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి మరో స్పెషల్ టీమ్

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం డ్రోన్లు, ఎండోస్కోపిక్ కెమెరాలు, వాకీటాకీల వంటి సిగ్నల్ పరికరాలతో బృందాలు లోపలికి ప్రవేశించాయి. సొరంగంలో సుమారు 200 మీటర్ల మేర బురద పేరుకుపోవడంతో, ఆ బురదతో పాటు నిలిచిన నీటిని తొలగించడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మద్రాస్ ఐఐటీ నిపుణులు కూడా సహాయక చర్యల్లో భాగమయ్యారు. ఉత్తరాఖండ్‌లో 2023లో జరిగిన టన్నెల్ ప్రమాదంలో 34 మందిని రక్షించిన అనుభవంతో, ఈ బృందం ఆధునిక పరికరాలతో టన్నెల్ లోపల పరిస్థితిని అంచనా వేస్తోంది. వీరితో పాటు విశాఖ నేవీ బృందం కూడా రంగంలోకి దిగింది.

ఇంకా, ఉత్తర కాశీలోని సిల్క్ యారా టన్నెల్‌లో చిక్కుకున్న 41 మందిని రక్షించిన ప్రత్యేక బృందం కూడా ఇక్కడికి చేరుకుంది. ఈ బృందం ‘ర్యాట్ మైనర్స్’గా ప్రసిద్ధి పొందింది. మొత్తం 12 మంది స్పెషలిస్టుల్లో ఆరుగురు ఇప్పటికే ఎస్ఎల్‌బీసీ వద్ద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు, మరో ఆరుగురు ఢిల్లీ నుండి బయలుదేరారు. ఈ బృందం టన్నెల్ లోపల చిన్న స్థలాల్లోనూ చొచ్చుకుపోయి, బురద, శిథిలాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తోంది.

‘ర్యాట్ మైనర్’ ఖురేషి మాట్లాడుతూ, తాము కలెక్టర్ ఆదేశాల మేరకు ఢిల్లీ నుంచి వచ్చామని తెలిపారు. టన్నెల్ లోపల పరిస్థితి ఇంకా పూర్తిగా అర్థం కాకపోయినా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సూచనల ప్రకారం పనిచేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు వేగం పుంజుకున్నా, లోపల బురద, నీరు, శిథిలాలు పెన్చ్‌లుగా మారాయి. అందువల్ల ప్రతి నిమిషం కీలకంగా మారింది.

ట్రస్మా సంఘంతో సేవలు చేశాను || Graduate MLC Candidate Yadagiri Shekar Rao Exclusive Interview || TR