ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తన నియోజకవర్గంలో ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె ఈ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం పోలింగ్ సరళి ఎలా ఉందో తెలుసుకునేందుకు సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం మండలం లోని రావిరాల గ్రామంలో పర్యటించారు. అయితే ఆ గ్రామంలోని పోలింగ్ బూత్-50 లోకి వెళ్లొద్దని టిఆర్ఎస్ నాయకులు బిజెపి నాయకులు కలిసి అడ్డుకుని ఆందోళన చేశారు.
దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోటీ చేస్తున్న అభ్యర్థిగా తాను పోలింగ్ బూత్ లోకి వెళ్లొద్దని అడ్డుకున్న యువకులపై సబితా ఇంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. అదే సమయంలో ఆమెకు, ఆ రెండు పార్టీల యువకులకు మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి పంపించివేశాయడంతో వివాదం సద్దుమణిగింది.
సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకున్న వీడియోలు రెందు కింద ఉన్నాయి చూడండి.