మునుగోడు ఉపఎన్నికలో ఓటు వేసే ఓటర్లకు తులం బంగారం, ఓటుకు 40,000 రూపాయలు పంచుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి రాగా చాలామంది ఆ వార్తలను నిజమేనని నమ్మారు. అయితే ఓటుకు 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు మాత్రమే ఇచ్చారని ఎక్కువ మొత్తం ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని సమాచారం అందుతోంది. మరోవైపు మునుగోడు ఉపఎన్నికే చివరి ఉపఎన్నిక అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఉపఎన్నిక సందర్భంగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తుండగా ఓటర్లు క్యూ లైన్లలోనే నిలిచి ఉండాల్సిన పరిస్థితి పలు ప్రాంతాల్లో ఏర్పడుతోంది. ఈరోజు ఉదయం 11 గంటల వరకు 25.8 శాతం పోలింగ్ జరగగా పోలింగ్ 70 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. బంగారం, డబ్బులు ఇస్తామని ఆశ పెట్టిన పార్టీలు అవి ఇవ్వకపోవడంతో ఓటు వేయబోమని కొందరు ఓటర్లు చెబుతుండటం గమనార్హం.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మునుగోడులో జరగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ అనంతరం ప్రముఖ సర్వే సంస్థలు సర్వే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు మునుగోడు ఉపఎన్నికే 2024 ఎన్నికలలోపు జరిగే చివరి ఉపఎన్నిక కానుందని తెలుస్తోంది. భారీ ఖర్చు నేపథ్యంలో అభ్యర్థులు ఉపఎన్నికపై ఆసక్తి చూపించడం లేదు.
ఈ ఎన్నికల్లొ గెలుపు రాజగోపాల్ రెడ్డికి కీలకం కాగా ఎన్నికల ఫలితాలు ఆయనకు అనుకూలంగా వస్తాయో లేదో చూడాలి. బీజేపీనే ఎన్నికల్లో గెలుస్తుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయో మరో 72 గంటల్లో తేలిపోనుంది.