మునుగోడులో షర్మిల పార్టీ పోటీ చేస్తే ఆ పార్టీకే నష్టమా.. అసలేమైందంటే?

తెలంగాణలో రాబోయే రోజుల్లో జరగనున్న మునుగోడు ఉపఎన్నికలో వైఎస్సార్టీపీ పోటీ చేసే ఛాన్స్ అయితే ఉందని గత కొన్నిరోజులుగా వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయనే సంగతి తెలిసిందే. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి చాలా కాలమైనా ఇప్పటివరకు ఏ ఎన్నికలో పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ అభిమానులు ఫీలవుతున్నారు. ఉపఎన్నికలలో పోటీ విషయంలో షర్మిల వెనుకడుగు వేస్తే పార్టీకే తీవ్రస్థాయిలో నష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రత్యర్థులకు ధీటుగా జవాబివ్వాలంటే షర్మిల మునుగోడు నుంచి తమ పార్టీ తరపున అభ్యర్థిని నిలబెడితే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. షర్మిల పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తే మాత్రం అధికార పార్టీకి నష్టమని ఎక్కువమంది భావిస్తున్నారు. తెలంగాణలో షర్మిల పార్టీకి బలం లేదు. షర్మిల పార్టీలో ప్రజల్లో మంచి గుర్తింపు, పేరుప్రఖ్యాతులు ఉన్న రాజకీయ నాయకులు ఎవరూ లేరనే సంగతి తెలిసిందే.

షర్మిల ఇప్పటినుంచి కష్టపడితే మాత్రమే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పుంజుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. షర్మిల పార్టీ మునుగోడు నుంచి పోటీ చేస్తే ఆ పార్టీ తరపున బీసీ మహిళ పోటీ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని సమాచారం అందుతోంది. మునుగోడు ఉపఎన్నిక వైఎస్ షర్మిలకు ఒక విధంగా పరీక్షేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పోటీ చేసి ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకపోయినా షర్మిల పార్టికే నష్టమని చెప్పవచ్చు.

మునుగోడు విషయంలో షర్మిల ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళతారో చూడాల్సి ఉంది. మీడియా కూడా ప్రస్తుతం షర్మిల పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. రాష్ట్ర రాజకీయాలలో షర్మిల పార్టీ ఏవైనా సంచలనాలు సృష్టిస్తే మాత్రమే మీడియా వైఎస్సార్టీపీపై దృష్టి పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. వైఎస్ షర్మిల నిర్ణయం కోసం ఆమె అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.