కేసిఆర్ పై మళ్లీ రేవంత్ రెడ్డి వివాదాస్పదన కామెంట్స్

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి అధికార టిఆర్ఎస్ పార్టీపై, సిఎం కేసిఆర్ మీద సంచలన, వివాదాస్పద ఆరోపణలు గుప్పించారు. హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారో కింద చదవండి.

శుక్రవారం కేసీఆర్ ఎమ్మెల్యేల కు ఇచ్చిన డబ్బాల్లో ఒక్కో ఎమ్మెల్యే కు కోటి రూపాయలు ఇచ్చారు.  టీఆర్ఎస్ భవన్ లో నిన్న ఒక్కరోజే వంద కోట్లు పంచారు. కోటి రూపాయలు ఇచ్చారని కొందరు ఎమ్మెల్యేలే మాతో చెప్పారు. దీనిపై మాకు పక్కా సమాచారం ఉంది. దీనిపై నిఘా వర్గాలు విచారణ చేయాలి. రాష్ట్ర నిఘా సంస్థలు, కేంద్ర నిఘా సంస్థలు తక్షణమే విచారణ జరపాలి. 

ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే  కేసీఆర్ కు అధిష్టానం మోడీ అన్న భావన కలుగుతున్నది. టిఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ బిజెపి శాఖగా మారిపోయింది. కేసీఆర్ అధిష్టానం గల్లీలో ఉంటే  ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారు?. కేసీఆర్ కు సహానీ అనే చీకటి స్నేహితుడు ఉన్నాడు. ఢిల్లీలో సహానీ లీలలు బయట పెట్టాలి. కేసీఆర్ ముందస్తు కోసం గూడుపుఠాణి చేస్తున్నారు. సీఎం చెబుతున్న ఇరవై ఐదు లక్షలు మంది అంతా వట్టిదే. రెండు లక్షల మంది తో ఇరవై ఐదు లక్షలు అని కేసీఆర్ చూపబోతున్నారు. 

కేసీఆర్ టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యల్లో భాగమే కేసీఆర్ ఇరవై ఐదు లక్షల జనాల మాట తప్ప మరొకటి కాదు. ఇరవై ఐదు లక్షల మంది రావాలంటే రెండు లక్షల వాహనాలు రావాలి. కేసీఆర్ చెబుతున్న విధంగా సభ జరిగితే నాలుగైదు వందల కోట్లు కావాలి. కేసీఆర్ కు ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి? గ్రామాల కు వెళ్లే ముఖం లేక ..హైదరాబాద్ లో సభతో ప్రజలను మభ్యపెడుతున్నారు.

కేటిఆర్ కు రేవంత్ సవాల్ : 

సిరిసిల్ల నుండి ఇరవై ఐదు వేల మంది వస్తారా? దమ్ముంటే చెక్ పోస్ట్ పెట్టండి తేలిపోతుంది. చెక్ పోస్ట్ దగ్గర ఇరవై ఐదు వందల వాహనాలతో ర్యాలీ తీసి  కేటిఆర్ వాట్సాప్ లో పెట్టాలి. ఈ పరీక్ష కు కేటీఆర్ రెడీ నా ..? గ్రామా సభ పెడితే టీఆరెస్ నేతలను ప్రజలు బట్టలూడదీస్తారు. టీఆర్ఎస్ లో కొత్తోళ్లకు టికెట్లిస్తే ..పాతోళ్లు ఓడిస్తారు ..ఇప్పుడు ఉన్నోళ్లకు ఇస్తే ప్రజలు ఓడిస్తారు 2019లో ఎట్టి పరిస్థితుల్లో టీఆరెస్ ను ప్రజలు ఓడించండం ఖాయం.