Revanth Reddy: తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో మార్పులను చేపట్టారు అయితే ఈయన ప్రజా పాలనని గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నారంటూ ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఏడాది కాలంలో ఈయన ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను కూడా అమలు పరచినట్లు వెల్లడించారు.
ఇకపోతే నేటి నుంచి తెలంగాణలో శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 9 వ తేదీ తెలంగాణ ప్రజలకు ఒక పండుగలాంటి దినం అని ఈయన తెలియజేశారు. తెలంగాణ ఉద్యమం ఓ భావోద్వేగ సందర్భమని ఆయన వ్యాఖ్యానించారు. మన సంస్కృతి సంప్రదాయలకు నిలువెత్తు నిదర్శనం తెలంగాణ తల్లి విగ్రహమని తెలిపారు.
ఇలా మన సంస్కృతి సాంప్రదాయాలను ఈ తెలంగాణ తల్లి విగ్రహంలో పొందు పరుస్తూ కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశామని ఈయన వెల్లడించారు అయితే గతంలో బిఆర్ఎస్ నాయకులు ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తూ నేడు రేవంత్ రెడ్డి మరో కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ విగ్రహ ఆవిష్కరణలో భాగంగా తెలంగాణ తల్లి ఏర్పాటు వెనక అలాగే ఈ విగ్రహంలో ప్రత్యేకతలను గురించి కూడా ఈయన తెలిపారు. ఈ విగ్రహం కింద పీఠంలో నీలి రంగు గోదావరి, కృష్ణమ్మలకు సూచిక అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లిని మార్చడం పట్ల బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో వ్యతిరేకత చూపుతున్నారు.
ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం మూర్ఖత్వం అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ సంస్కృతి ఒట్టి పడే విధంగా ఈ విగ్రహాన్ని రూపొందించారని ఇక నేడు ఏడాది పాలన విజయోత్సవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ విగ్రహావిష్కరణ జరగబోతుందని తెలుస్తుంది.