Kavitha: రేవంత్ కూడా బాబు శిష్యుడే కదా… తెలంగాణ తల్లి మార్పు పై ఫైర్ అయిన కవిత!

Kavitha: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మొదటిసారి నిజామాబాద్ జిల్లాలో పర్యటన చేశారు. ఇక ఈ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు ఈమెకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె పట్టణంలోని సుభాష్‌ నగర్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు కావడంతో ఆయన కూడా ఇక్కడ తెలంగాణ రూపు రేఖలను తెలంగాణ సంస్కృతిని మార్చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని అందులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు అంటూ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ తల్లి విగ్రహాలను సెక్రటేరియట్‌లో ఉంచారు. ఇక మనం ఆమెనే కొలవాలట అంటూ ఈమె ఫైర్ అయ్యారు.

తెలంగాణ తల్లి మాదిరా.. కాంగ్రెస్ తల్లి మీదిరా అంటూ ఈమె నినాదాలు చేశారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను మాయం చేసి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆడ బిడ్డలను అవమానపరిచారని మండిపడ్డారు.గురుకులాలను నడపడం కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే 57 మంది పిల్లలు చనిపోయారని తెలిపారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ ల ద్వారా ఉద్యోగ నియమకాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇక ఈ విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తూ బిజెపి కేసులు పెడుతుందని ఇక రాష్ట్రంలో అక్రమ కేసుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఈ సందర్భంగా కవిత తెలంగాణలో జరుగుతున్న అక్రమ అరెస్టుల గురించి అలాగే రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.