అలా జరగడంతో నిరాశలో రాజగోపాల్ రెడ్డి.. కష్టపడినా ఫలితం లేదా?

Komatireddy Rajagopal Reddy

మునుగోడు ఉపఎన్నిక హోరాహోరీ పోరులో ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠగా జరుగుతుండగా చౌటుప్పల్ లో అనుకున్న మెజారిటీ రాకపోవడంతో రాజగోపాల్ రెడ్డి నిరాశ చెందారు. కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయనా బయటకు వచ్చేయడం గమనార్హం. సొంత మండలం అయిన చౌటుప్పల్ లో తాను ఆశించిన మెజార్టీ రాలేదని ఆయన పేర్కొన్నారు.

మునుగోడు ఉపఎన్నిక ఫలితం ఎలాగైనా ఉండొచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చౌటుప్పల్ లో బీజేపీ కంటే తెరాసకు కొంతమేర ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును తేల్చే ఎన్నికలు అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కారు కమలం హోరాహోరీగా తలపడుతుండగా ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. రౌండ్ రౌండ్ కు ఉపఎన్నిక ఫలితం మారుతుండటం గమనార్హం.

ఐదో రౌండ్ ఎన్నికల ఫలితాల ప్రకటనకు అంతకంతకూ ఆలస్యం అవుతుండటం గమనార్హం. ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలను ప్రకటించడం లేదని ఎన్నికల ప్రధానాధికారిని కిషన్ రెడ్డిని ప్రశ్నించినట్టు సమాచారం అందుతోంది. తెరాస, బీజేపీలకు ఈ ఎన్నికల ఫలితం కీలకం కానుంది. సీఈవో తీరు అనుమానాస్పదంగా ఉందని బీజేపీ కామెంట్లు చేయడం గమనార్హం.

మొత్తం 15 రౌండ్లలో ఎన్నికల ఫలితాలు లెక్కిస్తుండటంతో ఏ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందో చెప్పడం తేలిక కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎక్కడో తేడా జరుగుతోందని బండి సంజయ్ కామెంట్లు చేశారు. ఫలితాలలో జాప్యానికి సంబంధించి ఈసీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.