అక్కడ కెసిఆర్ కు సెల్యూట్, ఇక్కడ ఆంధ్రలో పవన్ గెలవాలిః ప్రకాశ్ రాజ్

బెంగుళూరు సెంట్రల్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రఖ్యాత దక్షిణ భారత నటుడు ప్రకాశ్ రాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు సెల్యూట్ చేశారు. రాజకీయాలలో తానెపుడూ ఆయన వైపు చూస్తానని ఆయన అన్నారు. ప్రజలేమి చెప్పుకుంటున్నాకెసిఆర్ బిజెపి బి టీమ్ అని నేననుకోవడం లేదు.అయితే, నేనాయనకు నమస్కారం చేస్తున్నాను. ఆయన నాకు బాగా తెలుసు, అలాగే తెలంగాణలో ఆయన చేస్తున్న పనుల గురించి కూడా బాగా తెలుసు అని ఆయన అన్నారు.

ప్రకాశ్ రాజ్ ప్రచారం అట్టహాసంగా లేదు.  చడీ చప్పుడు లేకుండా ఆయన ప్రచారం చేస్తున్నారు. ర్యాలీలు, రోడ్ షోలు ఉండవు. నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు, వాళ్లనుంచి వినేందుకు ఆయన ప్రాముఖ్యం ఇస్తున్నారు. సాధారణంగా ఎన్నికల్లో అభ్యర్థులు ఉపన్యాసాలు దంచేస్తూ వరాల వర్షం కురిపిస్తూ పోతుంటారు. అలా కాకుండా  చిన్న చిన్న టౌన్ హాలు సమావేశాలలో ప్రచారం ఉండాలి. అక్కడ ఓటర్లకు అభ్యర్థులకు మధ్య సంభాషణ ఉండాలనేది ఆయన నమ్మకం. ఇదే ఆచరణలో పెడుతున్నారు. ఆలోచించండి ఓటేయండి అనేది ఆయన నినాదం

న్యూఇండియన్ ఎక్స్ ప్రెస్ కు తో మాట్లాడుతూ కొత్త తరంలో వ్యవస్థ మీద ఇంకా విశ్వాసం ఉందని అన్నారు. కొత్త తరం రాజకీయాల్లోకి చట్ట సభల్లోకి రావాలి. అందుకే జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడ కన్నయ్య కుమార్ ఈ ఎన్నికల్లో గెలవాలి. తుక్డే తుక్డే గాళ్లెవరెన్ని చెప్పినా ఆయన గెలవాలని కోరుకుంటున్నా. అంతేకాదు,జనసేన నేత పవన్ కల్యాణ్ కూడా గెలవాలని కోరకుంటున్నా. మనకిపుడు కొత్త నాయకులు కావాలి, కొత్త నీళ్లెలావుంటాయో టెస్ట్ చేయాలి అని అయన అన్నారు.

“There is hope in the younger generation. I want Kanhaiya Kumar to win. Whatever ‘tukde tukde’ people say, he is the future. I want me to win. I want Pawan Kalyan to win. We need new leaders and then we need to test the waters. There is KCR, I look up to him. Irrespective of what people say he is not BJP’s B team. I know him very well and the kind of work he is doing in Telangana, I salute him.”

కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీని ప్రజలు తిరస్కరిస్తారని ఆయన ఆశిస్తున్నారు. ‘ ఈ రెండుపార్టీలు ప్రజలను నిరాశకు గురి చేశాయి.రెండు పార్టీలు పేదలను విస్మరించాయి. ఇక ఈ తమాషా చాలు. బెంగుళూరు సెంట్రల్ ప్రజలు ఈ రెండు పార్టీల లోగుట్టు తెలుసుకుంటారని ఎన్నికల్లో చరిత్ర సృష్టించే అవకాశం తనకిస్తారని ఆయన భావిస్తున్నారు.

 

‘నటుడిగా నాకున్న పాపులారిటీతో నేను ఓట్లు అడగటం లేదు. నన్నొక యాక్టివిస్టు ప్రజలు చూశారు. అదే విధంగా యాక్టర్ గా నేనెంతగా పోరాడాల్సి వచ్చిందో ప్రజలు చూశారు. నేను గ్రామాలను దత్తత తీసుకుని పనిచేయడం చూశారు. గత అయిదేళ్లలో నెనెలా నా హాయి అయిన జీవితం వదులుకుని సమస్యల మీద ఒకస్టాండ్ తీసుకుని నిలబడ్డానో అంతా చూశారు. రెండు దశాబ్దాలుగా ప్రజలు నాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఇవి చూసే ఓటస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రచారం గురించి చెబుతూ తనకు పెద్ద పెద్ద ర్యాలీల మీద నమ్మకం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. ‘ఎన్నికలు ప్రజలకు , అభ్యర్థికి మధ్య సంభాషణలాగా ఉండాలి. ఈ ప్రచారంలో నేను సరిగ్గా ఇదే అనుసరిస్తున్నాను. చిన్న చిన్న టౌన్ హాల్ సమావేశాల మీద నాకు నమ్మకం ఉంది. ఈ సమావేశాలలో ఇరువురి సంవాదాలుంటాయి. ప్రజలు నన్ను బాగా స్వాగతిస్తున్నారు. ఇదంతా చూశాక, బెంగుళూరు సెంట్రల్ ప్రజలు ఈ సారి వోటేసే ముందు బాగా ఆలోచిస్తారనే నమ్మకం ఉంది,’ అని ప్రకాశ్ రాజ్ చెప్పారు.

ఇపుడు బెంగుళూరెలా ఉంది, మీరు బెంగుళూరు ఎలా ఉండాలనుకుంటున్నారని అడిగినపుడు బెంగుళూరులో కాలుష్యం, హౌసింగ్, మంచినీరు ప్రధాన సమస్యలని ఆయన చెప్పారు.‘ ఒకపుడు బెంగుళూరులో 250 చెరువులుండేది. ఇపుడు 50 మాత్రమే మిగిలాయి. బెంగుళూరు గురించి మాట్లాడుకుంటూ ఎంతసేపు మనం ఇపుడు లాల్ బాగ్, కబ్బన్ పార్క్ గురించి చెబుతాం. ఇక పేద ప్రజల గురించి చెబితే, ఎవరో పొరక తీసుకువచ్చి ఈ పేదలందరిని దూరంగా వూడ్చిపడేశారన్నట్లనిపిస్తుంది. వీళ్లంతా కూడా వోటర్లే.హౌసింగ్,మంచినీళ్ల సమస్య తీవ్రంగా ఉంది. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలవుతున్నా మనం మహిళలు ఇంకా నీళ్లకోసం కటకటలాడాల్సివస్తున్నది. ఇదంతా ముందుచూపులేక వస్తున్న సమస్య. ఇక్కడొకరు పదేళ్లుగా ఉన్నారు. పెరిగిపోతున్న జనాభా, మంచినీళ్ల సమస్య, అంతరించిపోతున్న తటాకాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా ఆయనకు?