తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కారు జోరుమీదున్నది. 90 స్థానాలకు అటు ఇటుగా ఆ పార్టీ ఘన విజయం సాధించబోతున్నది. అయితే ఈ ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారన్న వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి.
కాంగ్రెస్ 20 సీట్ల దగ్గర కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీలో కొమ్ములు తిరిగిన పెద్ద లీడర్లంతా ఓటమి దిశగా సాగుతున్నారు. సీనియర్ నేతలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఓటమిపాలయ్యారు. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఓటమి పాలయ్యారు. మాజీ మంత్రి జానారెడ్డి ఓటమి దిశగా సాగుతున్నారు. అదే బాటలో డికె అరుణ, సునితా లక్ష్మారెడ్డి, దామోదర రాజనర్సింహ్మ, సబితా ఇంద్రారెడ్డి కొనసాగుతున్నారు.
అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చదవండి.
తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయి.
మేము మొదటి నుంచి అనుమానిస్తున్నట్టుగానే ఈవీఎం లలో టాంపరింగ్ జరిగినట్టు స్పష్టమైన అనుమానాలు ఉన్నాయి.
VVpat లలో స్లిప్ ల ఓట్ల లెక్కింపు తప్పకుండా జరపాలి.
ఈ విషయంలో అందరూ ప్రజా కూటమి అభ్యర్థులు రిటర్న్ అధికారులకు ఫిర్యాదు చేసి.. vvpat లెక్కింపు జరిపే వరకు పట్టు పట్టాలి.
దీనిపై ఈసీ కి కూడా ఫిర్యాదు చేస్తున్నాము.
ఎవరెవరు ఒడిపోతారో టిఆర్ఎస్ నాయకులు ముందుగానే ఎలా చెపుతారు.
ఎన్నికల ఫలితాలు ముందుగానే ఎలా చెప్పగలిగారో చెప్పాలి. ఇదంతా టాంపరింగ్ ను బలపరుస్తున్నాయి.