తెలంగాణ రోడ్లపై తడబడ్డ పవన్… మీమ్స్ వైరల్!

గుండెల నిండా ధైర్యం ఉంది అని చెప్పుకునే పవన్ కల్యాణ్ కి చాలా విషయాల్లో విపరీతమైన భయం అని అంటుంటారు పరిశీలకులు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుని విమర్శించాలన్నా.. తన వారెవరైనా టీడీపీ నేతలను విమర్శించినా.. పవన్ కు భయం అని అంటుంటారు. ఇదే సమయంలో తెలంగాణలో బీఆరెస్స్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే అంతకు మించి అన్ని తాజాగా రుజువైందని చెబుతున్నారు.

అవును… తాజాగా హైదరాబాద్ లో “బ్రో” సినిమా ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైకందుకున్న ఆయన సినిమా గురించి, సాయిధరం తేజ్ యాక్సిడెంట్ గురించి ప్రత్యేకంగా ప్రస్థావించారు. సాయి తేజ్ కి ప్రమాధం జరిగినప్పుడు అభిమానులే రక్షించారని తెలిపారు. ఈ సందర్బహంగా రోడ్ల ప్రస్థావన తెరపైకి వచ్చింది.

గతకొన్ని రోజులుగా ఏపీలో వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యల దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే దిష్టిబొమ్మల దహనాలు, ఫోటోలను చెప్పులతో కొట్టడాలు, కేసులు చాలా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఏకవచనంతో పిలవడం, జగ్గూ భాయ్ అని సంబోధించడం చేస్తున్నారు పవన్.

ఈ సమయంలో తాజాగా ఏపీలో రోడ్ల ప్రస్థావన తీసుకొచ్చారు. అవును.. ఏపీలో రోడ్ల దుస్థితిపై పవన్ సెటైర్లు వేశారు. హైదరాబాద్ శిల్పారామంలో జరిగిన బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో మైకందుకున్న పవన్… ఏపీ రోడ్ల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. హైదరాబాద్‌ లో ఉన్న రోడ్లు అక్కడి (ఏపీ) రోడ్లలా కాదు.. అంటూ వ్యాఖ్యానించారు.

సాయి ధరమ్ తేజ్ ఇదివరకు బైక్‌పై వెళ్తూ జారి పడ్డ విషయంపై మాట్లాడే సమయంలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎవరో రోడ్డుపై ఇసుక వేస్తే.. బైక్‌ పై వెళ్తూ సాయి ధరమ్ జారిపడ్డాడని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. రోడ్లు ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా? అని తెలంగాణలోని రోడ్ల గురించి మాట్లాడబోయి మాట మార్చారు. అనంతరం తమాయించుకుంటూ… హైదరాబాద్‌ లో రోడ్లు బాగున్నాయని, అక్కడి రోడ్ల గురించి తాను మాట్లాడట్లేదని పవన్ కల్యాణ్ చెప్పారు.

దీంతో సోషల్ మీడియాలో మీంస్ మొదలైపోయాయి. పవన్ ధైర్యంపై ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి! ఏపీ ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు ఉన్నవీ లేనివీ మాట్లాడే పవన్ కల్యాణ్… తెలంగాణ విషయంలో మాత్రం నోరు ఎత్తే సాహసం చేయరని.. చేస్తే కేసీఆర్ ఫాం హౌస్ కి పిలిస్తారని సెటైర్లు వేస్తున్నారు.

గా… హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి గురించి తెలిసిందే! ఇక ఇప్పుడు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ లో రోడ్లు ఏలా ఉన్నాయో సెక్యూరిటీతో కాన్వాయ్ లో వెళ్లే పవన్ కు తెలియకపోవచ్చు కానీ… సామాన్యులను అడిగితే చెబుతారని అంటున్నారు. ఏది ఏమైనా… గుండెల నిండా ధైర్యం ఉంది… కానీ ఏపీలోనే!!