తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కొత్త రికార్డు నెలకొల్పారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఎవరూ ఈ తరహా రికార్డు నెలకొల్పలేదు. సూర్యాపేట సమీపంలో టేకుమట్ల దగ్గర టీఆరెస్ కార్యకర్తలు, అభిమానులు సిమెంటుతో కారు గుర్తును నిర్మించారు. టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల చిహ్నమైన ఆ సిమెంట్ కారును మంత్రి జగదీశ్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు.
తెలంగాణలో ఇటువంటి నిర్మాణం ఇప్పటివరకు ఎక్కడా లేదు. ఇదే మొట్టమొదటిది కావడం గమనార్హం. దాదాపు లక్ష రూపాయల వ్యయంతో 20 రోజులలో దీన్ని నిర్మించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల గుర్తు ఇలా సృజనాత్మక రూపం ఇవ్వడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సిమెంట్ కారు గుర్తును ఓపెన్ చేయడం ద్వారా మంత్రి రికార్డు నెలకొల్పారు. రానున్న రోజుల్లో తెలంగాణలో సిమెంట్ కారు గుర్తుల చిహ్నాలు మరిన్ని షురూ అయ్యే అవకాశముంది.
మంత్రి జగదీష్ రెడ్డి ఓపెన్ చేసిన సిమెంట్ కారు చిహ్నం వీడియో ఉంది చూడండి.
[videopress L0c3xJXv]