Chiranjeevi: ఏ పార్టీలో చేరుకుండా రాజ్యసభకు వెళుతున్న మెగాస్టార్ చిరంజీవి… పవన్ ప్లాన్ సక్సెస్!

Chiranjeevi: జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈయన కూటమిలో భాగంగా విజయం సాధించారు మరోవైపు బిజెపి పార్టీకి కూడా ఏపీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలా కేంద్రంతో ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తన ఇమేజ్ తో తన అన్నయ్యలకు కూడా మంచి అవకాశాలను ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి.

ముఖ్యంగా తన అన్నయ్య నాగబాబుకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారంటూ మొదట్లో వార్తలు వచ్చాయి కానీ ఆ వార్తలు నిజం కాదని తెలిసింది. అలాగే రాజ్యసభకు తన అన్నయ్యను పంపించాలని ఆలోచన చేశారు కానీ అది కుదరకపోవడంతో నాగబాబును ఏపీ క్యాబినెట్లోకి పంపించబోతున్నారని తెలుస్తుంది. ఇలా నాగబాబుకు ఏపీ మంత్రిగా అలాగే తన పెద్దన్న చిరంజీవిని రాజ్యసభకు పంపించే ఆలోచనలు పవన్ ఉన్నారని తెలుస్తోంది.

ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఎన్నికలలో గెలిచినటువంటి చిరంజీవి కొంతకాలానికి ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు అయితే రాజకీయాలపై విరక్తి కలిగిన ఈయన రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలపై దృష్టి సారిచ్చారు. అయితే తాజాగా ఈయన ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహించకుండా ఎక్కడ పోటీ చేయకుండా చిరంజీవిని కూడా రాజ్యసభకు పంపించాలనే ఆలోచనలో ఉన్నారని అందుకు కేంద్రం కూడా సానుకూలంగా ఉందని సమాచారం.