మండవ టిఆర్ ఎస్ లో ఎందుకు చేరారు? తెలిస్తే ఆశ్చర్య పోతారు…

ఒకప్పుడు ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకుడు,మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు నిజామాబాద్ లో టిఆర్ ఎస్ అభ్యర్థి కవిత గెలుపుకోసం కృషి మొదలుపెట్టారు.
నిజామాబాద్ లో పసుపు రైతులు, ఎర్రజొన్నరైతులు ఆగ్రహంతో తామూ నామినేషన్లు వేసి ప్రధాన అభ్యర్థులందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. 175 రైతుల ప్రభావం ఎలాఉంటుందోననే చర్చ మొదలయింది. ఈ రైతులలో చాలా మంది సెటిలర్స్ ఉన్నారని చెబుతున్నారు.
దీని వెనక రాజకీయ శక్తులున్నాయని, రైతులకు తన మీద అసంతృప్తితో లేదని టిఆర్ ఎస్ అభ్యర్థి కవిత అంటున్నారు.
ఎమైనా రైతులు ఇలా నిరసన నామినేషన్లు వేసి ప్రశాంతంగా సాగాల్సిన నిజామాబాద్ ఎన్నికల్లో కలకలం సృష్టించారు. ఈనేపథ్యంలో మండవ వెంకటేశ్వరరావు టిఆర్ ఎస్ లోకి చేరారు.
ఆయనను పార్టీలోకి ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా మండవ నివాసానికి వెళ్లారు.
ఈ రైతుల ప్రభావం లేకుండా చూసేందుకే కెసిఆర్ మండవ సాయం తీసుకుంటున్నారని రాజకీయ వర్గాలలో వినబడుతూ ఉంది. ఈనేపథ్యంలో తానెందుకు పార్టీలో చేరింది మండవ వివరించారు. తాను టిఆర్ ఎస్ లోచేరడం రాజకీయ నిర్ణయం కాదని, అనుబంధం, ఆత్మీయత అని ఆయన అన్నారు.
నిజామాబాద్ లోని కవిత కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అనుబంధం ఆత్మీయత గురించిఅనేక ఆసక్తి కరమయిన విషయాలను వెల్లడించారు. ఆయన మన్ కి బాత్ ఎలా ఉందో చూడండి.
కవిత గెలుపు కోసమే కెసిఆర్ తన ఇంటికి వచ్చారని తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. ఇది సరికాదు. ఎన్నో ఏళ్లుగా మా మధ్య స్నేహం ఉంది. అందుకే కెసిఆర్ మాయింటికి వచ్చి ‘రా బై తెలగాణ కోసం కలసి పనిచేద్దాం అని ఆత్మీయంగా పిలిచారు. పార్టీలో చేరాను.
‘కెసిఆర్ రాజకీయంగా నాకు మంచి స్నేహితుడు. అనేక సంవత్సాలు కలసి పనిచేశారు. ఇపుడు నేను పింక్ కండు వా కప్పునేదేంది. 2004లోనే పోత్తులో భాగంగా టిఆర్ ఎస్ కండువా కప్పుకున్నా, కెసిఆర్ తో కలసి పని చేశా. 1985 నుంచి మేం సహచరులం.
మొదటిసారి నేను డిచ్ పల్లి నుంచి, కెసిఆర్ మెదక్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచాం. ఎమ్మెల్యే క్వార్టర్లలో పక్కపక్కనే ఉన్నాం. మాకుటుంబాల మధ్య చాలా అన్యోన్యత ఉంది. ఆ రోజుల్లో నాళ్ల ముందే కవిత, కెటిఆర్ చెంగుచెంగున ఆడుకున్న సందర్భాలున్నాయి. నా కూతురు లాంటిది కవిత. ఆమెను ఎపుడూ అలాగే చూశాను.
‘తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎపుడూ వ్యతిరేకించలేదు. ఒకపుడు మదరాసీయులకు వ్యతిరేకంగా కలిశాం. అరవై యేళ్ల సొంత రాష్ట్రం కోసం పనిచేశాం. రాష్ట్రం ఏర్పాటులో కెసిఆర్ పాత్ర అనిర్వచనీయం. పార్టీలతో విబేధాలు వస్తే పార్టీ సంస్థాపకుడు ఎన్టీఆర్ తోనే మేం పోరాటం చేశాం.
‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో నేను చంద్రబాబునే వ్యతిరేకించాను. టిఆర్ ఎస్ తోనే తెలంగాణ భవిష్యత్తు బంగారు మయం అవుతుంది. రాజకీయాల్లో రిటైరయ్యేదేముంటుంది. టిఆర్ ఎస్ ను గెలిపించేందుకు పనిచేస్తాను.’