KTR: సౌండ్ తగ్గించిన కేటీఆర్… రేవంత్ నిర్ణయాలు భయపెట్టాయా… అందుకే తగ్గారా?

KTR: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు సినిమా వారితో చాలా మంచి అనుబంధము ఉంది ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి కేటీఆర్ మంత్రిగా ఉండటంతో ఆయన సినిమా వాళ్ళతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ సినిమా ఈవెంట్లకు వెళ్లడం వారి సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొనడం వంటివి జరుగుతూ ఉండేవి అయితే ఈయన మంత్రిగా ఉండడంతో సినిమా వాళ్లు కూడా కేటీఆర్ ను నెత్తిన పెట్టుకొని తిరిగారు.

ఇక గత ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కేటీఆర్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారికి మధ్య వాతావరణం మంచిగా లేదని తెలుస్తుంది అయితే ఏ విషయంలోనైనా కూడా కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా కేటీఆర్ చాలా సైలెంట్ అయ్యారని చెప్పాలి. ఇలా కేటీఆర్ మౌనం వెనుక రేవంత్ రెడ్డి తీసుకున్న షాకింగ్ నిర్ణయాలే కారణమని తెలుస్తుంది.

ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో ఇంత పెద్ద వివాదం జరగడానికి పరోక్షంగా కేటీఆర్ కారణమని చెప్పాలి అటు అల్లు అర్జున్ ఇటు రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టింది కూడా కేటీఆర్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో వెంటనే కేటీఆర్ స్పందించడమే కాకుండా పలు మీడియా సమావేశాలలో కూడా ఈ అరెస్టు గురించి మాట్లాడుతూ పాపం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే తనని అరెస్టు చేయించారు అంటూ పదేపదే గుర్తు చేశారు.

ఇలా రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ మాట్లాడటంతోనే అల్లు అర్జున్ పూర్తిస్థాయిలో వివాదంలో చిక్కుకున్నారని చెప్పాలి అయితే గత కొద్ది రోజులుగా ఈ విషయంలో కేటీఆర్ ఎక్కడ కూడా మాట్లాడలేదు అలాగే సోషల్ మీడియాకి కూడా కాస్త దూరమయ్యారు దీంతో ఈయన ఉన్నఫలంగా సౌండ్ తగ్గించడానికి కారణం ఏంటని ఆరా తీస్తున్నారు.

కేటీఆర్ ఉన్నఫలంగా మౌనం పాటించడానికి కారణం..ప్రస్తుతం అవినీతి ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ ఈ వ్యవహారంలో మాట్లాడేందుకు ఇష్టపడలేదు.
అటు ఏసీబీ అధికారులు కూడా కేటీఆర్ ను ఇబ్బంది పెట్టే సంకేతాలు కనపడటంతో ఆయన అసలు సోషల్ మీడియాలో కూడా ఈ వ్యవహారంపై మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ప్రతి అంశంపై ట్వీట్ చేసే కేటీఆర్ సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నారని చెప్పాలి.