కోటి రూపాయల ఆశ్రమాన్ని తెలంగాణ సర్కార్ కు రాసిచ్చేశారు

వృద్దాప్య వయసులో పడేవారి బాధలను చూసి వారి కోసం స్వంత స్థలంలో వృద్దాశ్రమాన్ని నిర్మించారు ఆ దంపతులు. ఆలనా పాలనా చూసే వారు లేకుండా ఉన్న వృద్దలను అక్కున్న చేర్చుకొని సేవలందించారు. ఇప్పుడు వారి వయసు మీద పడడంతో వారి ఆలనా పాలనా ఆగం కావద్దని మానవత్వంతో ఆలోచించి ఆ వృద్దాశ్రమాన్ని ప్రభుత్వానికి అప్పగించి గొప్ప మనసును ఆ దంపతులు చాటుకున్నారు. కోటిన్నర విలువైన ఆశ్రమాన్ని ప్రభుత్వానికి అప్పగించారు.  పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామానికి చెందిన మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి, జానకమ్మ దంపతులు. వృద్దుల బాధలు చూసి వారి స్వంత స్థలం ఎకరంనర భూమిలో 6వేల చదరపు అడుగుల స్థలంలో భవానాన్ని నిర్మించారు. అందులో చేరిన వారికి కూడా వారే సౌకర్యాలు కల్పించారు. ఇటీవల వారికి వయసు మీద పడడంతో ఆశ్రమం నిర్వహణ కష్టంగా మారింది. దీంతో ఆశ్రమ నిర్వహణ బాధ్యతతోపాటుగా ఆశ్రమ బిల్డింగ్, స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఆ భవనం విలువ ప్రస్తుం కోటిన్నర రూపాయలు.

గురువారం టిఆర్ఎస్ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను ఆ వృద్దదంపతులు కలిశారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వారు కేటిఆర్ ను కలిశారు. ప్రభుత్వం ఆశ్రమ సేవా కార్యక్రమాన్ని కొనసాగించేలా చూడాలని వారు కోరారు. దీంతో స్పందించిన కేటిఆర్ వెంటనే దీనికి సంబంధించిన చర్యలు చేపట్టేలా చూడాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ ను ప్రభుత్వం తరపున ఆదేశిస్తామని ఆయన హామీనిచ్చారు.  ఆ వృద్ద దంపతుల నిర్ణయాన్ని ఆయన కొనియాడారు.

వృద్ద దంపతుల నిర్ణయం పై కేటిఆర్ ట్వీట్టర్ లో స్పందించారు.. ఆయన ఏమన్నారంటే

“సత్యనారాయణ రెడ్డి దంపతులు తమ సొంత నిధులతో కోటి రూపాయల విలువ చేసే వృద్ధాశ్రమాన్ని నిర్మించారని.. నిర్వహణ నిమిత్తం దాన్ని ప్రభుత్వానికి అందించారని తెలిపారు. వారి లోకోపకార గుణానికి వందనం” అంటూ కేటిఆర్ ట్వీట్ చేశారు. 

కేటిఆర్ ట్వీట్ ఇదే