Konda Surekha: హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు. నిన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్లో హల్చల్ చేశారు. అయితే ఈ విషయంపై మంత్రి కొండ సురేఖ కౌశిక్ రెడ్డి గురించి హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా కొండ సురేఖ మాట్లాడుతూ..హుజరాబాద్ ఎమ్మెల్యే వాడో పిచ్చోడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడుతాడో తెలియదని మండిపడ్డారు.
కౌశిక్ రెడ్డి అసెంబ్లీకి వస్తే గొడవ చేస్తాడని అన్నారు. అసెంబ్లీలో చప్పట్లు కొట్టి డాన్సులు చేసే సంస్కృతి ఇంతకుముందు అసెంబ్లీలో లేకుండే అన్నారు. కౌశిక్ రెడ్డి మెదడు లేకుండా మాట్లాడుతున్నారని ఈమె మండిపడ్డారు. ఇక కేసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేసి కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వం గురించి ఏదైనా మాట్లాడాల్సి వస్తే మీ అయ్యతో మాట్లాడించు అంటూ ఈమె కేటీఆర్ పై కూడా విమర్శలు చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు నువ్వే రాజు నువ్వే మంత్రి అనే విధంగానే వ్యవహరించావని కొండ సురేఖ ఫైర్ అయ్యారు. ఇప్పుడు అధికారంలో లేకపోయినా అన్ని తానై వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అంతా దోచుకుని మీ కుటుంబం మాత్రమే బాగుపడింది. కానీ రేవంత్ రెడ్డి గారు అలా అనుకోవడం లేదు మేము మీలాగా కాదు.. ఇలా గతంలో దోచుకున్నారు కాబట్టి కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా వెళ్ళగొడుతున్నారని కొండా సురేఖ ఫైర్ అయ్యారు.
ఇలా ఇస్టాను సారంగా పెట్రేగిపోయి మాట్లాడుతూ ఉంటే చూస్తూ అస్సలు ఊరుకోమని తెలిపారు. తెలంగాణ తల్లి నీ కేటీఆర్ దొరసాని లెక్క చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత లెక్క వడ్డాణం.. దొరసాని లాగ పెట్టుకున్నారన్నారు. మేము తెలంగాణ నిండుతనం ఉండేలా చూస్తున్నాం అంటూ కొండా సురేఖ బిఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.