KCR: నాపై పగతోనే తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చారు: కెసీఆర్

KCR: తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ గా ఉన్న సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు అయితే ఇటీవల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి రూప రేఖలను పూర్తిగా మార్చేసి ఇటీవల సచివాలయంలో నూతన విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం మనకు తెలిసిందే. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల బిఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో వ్యతిరేకత చూపుతున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణ మాజీ మంత్రి కేసీఆర్ సైతం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై దాడిని మరింత ఉధృతం చేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు ఈయన దిశా నిర్దేశం చేశారు. ఇక తెలంగాణ తల్లి మార్పుపై కూడా కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

తెలంగాణ అస్తిత్వం, ఆకాంక్షలపై ఏమాత్రం అవగాహన లేని ముఖ్యమంత్రి డిజైన్‌ను మార్చేయడం శోచనీయమన్నారు. రాజకీయ స్వార్థం, తన మీద ఉన్న పగ కారణంగానే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు రేవంత్ రెడ్డికి తెలియని తెలంగాణలో తన ముద్రను చెరిపేయడం కోసమే ఈయన తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు చేశారని తెలిపారు.

దేవతను తలపించే విధంగా తెలంగాణ తల్లి చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. తెలంగాణ చారిత్రక నేపథ్యం, వారసత్వంపై అవగాహన లేని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం బుద్ధిహీనంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. తనమీద పగ తీర్చుకోవడం కోసం తెలంగాణలో తన మార్క్ చెరిపేయడం కోసమే రేవంత్ రెడ్డి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని కెసిఆర్ మండిపడ్డారు.