KCR: ఆ విషయంలో మాట నిలబెట్టుకున్న కేసీఆర్… ఇచ్చిన మాటకి కట్టుబడే ఉన్నారా?

KCR: ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసిఆర్ 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈయన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కానీ తన పార్టీ పరాజయం కావడం కాంగ్రెస్ విజయం సాధించడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ పరిపాలన కొనసాగుతోంది.

ఇక తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కేసీఆర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు. ఆయన కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారే తప్ప ఏ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే ఒక్కసారి కేసీఆర్ అసెంబ్లీలోకి వస్తే ఆయనతో మాట్లాడాలని ఉంది అంటూ ఎంతో మంది కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు చివరికి ముఖ్యమంత్రి కూడా ఈ విషయం గురించి ప్రస్తావించారు.

ఇలా ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ ను చూడాలని ఆయనతో మాట్లాడాలని ఉంది అంటూ రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాలలో తెలియజేశారు. కానీ కెసిఆర్ మాత్రం ఇప్పటివరకు అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు. అయితే ఆయన ఇచ్చిన మాట ప్రకారమే అసెంబ్లీలోకి అడుగుపెట్టడం లేదని తెలుస్తోంది.

2023 ఎన్నికల ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టిన తర్వాత మొదటి సభలోనే కెసిఆర్ మాట్లాడుతూ తాను కనుక ఈ ఎన్నికలలో గెలిపిస్తే సచివాలయంలో ఉంటా.. ఓడిపోతే ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటా అంటూ ఒకటే మాటే చెప్పారు. ఈ విషయాన్ని కెసిఆర్ పదేపదే ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో చెప్పిన ప్రజలు మాత్రం కాంగ్రెస్ కి పట్టం కట్టారు. దీంతో ఆయన కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అందుకే అసెంబ్లీలోకి రావడం లేదని తెలుస్తోంది.

ఇక కెసిఆర్ బయటకు వచ్చి కాంగ్రెస్ పాలనపై మాట్లాడితే చూడాలని ఎంతోమంది అభిమానులు కూడా భావిస్తున్నారు కానీ ఆయన గత పాతిక సంవత్సరాలుగా తెలంగాణ కోసం ఎంతో కష్టపడుతున్నారని అందుకే విశ్రాంతి తీసుకుంటున్నారని రావాల్సిన సమయంలో తప్పకుండా బయటకు వస్తారు అంటూ కేటీఆర్ కూడా కెసిఆర్ గురించి వెల్లడించారు.