కేసీఆర్ కూతురు భాష హద్దులు దాటిందా.. ఇలాంటి విమర్శలు అవసరమా?

mlc kavitha telugu rajyam

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ మధ్య కాలంలో తనపై బీజేపీ నేతల నుంచి ఆరోపణలు ఎక్కువైన నేపథ్యంలో కవిత ఘాటుగా విమర్శలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతానని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై తెరాస ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కవిత ఫైర్ అయ్యారు. తాను పార్టీ మారతానని కామెంట్లు చేస్తే బుద్ధి చెబుతానని ఆమె అన్నారు.

నా గురించి అర్వింద్ ఇష్టానుసారం మాట్లాడితే నిజమాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని కవిత కామెంట్లు చేశారు. ధర్మపురి అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటపడి ఓడిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. రాజకీయాలు చేయాలని అంతే తప్ప దిగజారి ప్రవర్తించడం సరి కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ కూతురు కవిత గతంలో ఇలా మాట్లాడిన సందర్భాలు ఎప్పుడూ లేవనే సంగతి తెలిసిందే.

చెప్పుతో కొడతానంటూ కవిత చేసిన కామెంట్ల వల్ల ఆమె ప్రజల్లో చులకన అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇతరులపై విమర్శలు చేయడానికి ఒక లిమిట్ ఉంటుందని హద్దులు దాటి చేసే విమర్శలు ఏ రాజకీయ పార్టీకి మంచిది కాదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కవితకు సూచనలు చేస్తున్నారు. ఎన్నికలకు 18 నెలలు ఉన్న తరుణంలో ఈ తరహా విమర్శల వల్ల పార్టీకి నష్టమేనని చెప్పవచ్చు.

రాజకీయాల్లో హద్దులు దాటిన విమర్శలు సాధారణమైపోతున్నాయి. ఈ తరహా విమర్శల ద్వారా ప్రముఖ రాజకీయ నేతలు ప్రజల్లో చులకన అవుతున్న సందర్భాలు సైతం ఉన్నాయి. చెప్పుతో కొడతా లాంటి వ్యాఖ్యలు చేయకుండా కవిత హుందాగా స్పందించి ఉంటే బాగుండేదని మరికొందరు చెబుతుండటం గమనార్హం.