సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఎదుర్కొంటున్న కవితక్క!

చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు విషయంలో జరుగుతున్న జాప్యానికి వ్యతిరేకంగా… మార్చి 10న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద “భారత్ జాగృతి” ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేయనున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే… చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచే ఈ బిల్లు గురించి.. ఎవరు పోరాడినా సరే అది ఆహ్వానించాల్సిందే కానీ.. కేసీఆర్ కూతురు పోరాడుతుండటమే ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు తెలంగాణ మహిళలు! అందుకు వారు చూపిస్తున్న ప్రూఫ్ లు – సందిస్తున్న ప్రశ్నలు విన్న తర్వాత అంతా అదేమాట అనాల్సిన పరిస్థితి!

విషయానికొస్తే… చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లు గురించి కవిత.. హస్తినలో దీక్ష చేస్తానని ప్రకటించారు. దీంతో… “2014లో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఏర్పాటైన కేసీఆర్ క్యాబినెట్లో ఎంతమంది మహిళలకు అవకాశం ఇచ్చారు కవితక్కా?” అని ప్రశ్నిస్తున్నారు టి.మహిళలు! దీనికి అనుబంధంగా… ఆరోజు మీరు ఎక్కడ ఉన్నారు అక్కా? మరోప్రశ్న సందిస్తున్నారు!

ఇదే క్రమంలో… మహిళా బిల్లు సాధించడమే తన జీవితాశయం అన్న స్థాయిలో మాట్లాడుతున్న కవితక్క.. “తమ పార్టీ గెలిస్తే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ బిల్లును చట్టం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదికగా ప్రకటించింది కాబట్టి.. వారి ప్రకటనలను గౌరవిస్తూ, వారు ఆ పని చేసేటట్లయితే కాంగ్రెసుకు జై కొడతానని చెప్పగలవా అక్కా?” అని అడుగుతున్నారు!

సరే జరిగిందేదో జరిగింది.. కవితక్కకు ఇప్పుడే జ్ఞానం వచ్చిందని సరిపెట్టుకున్న మహిళాలోకం… “జరిగిందేదో జరిగింది… పోని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అయినా బీఆరెస్స్ తరుపున 33శాతం మంది మహిళలకు టిక్కెట్లు ఇస్తామని మీ అయ్యతో చెప్పించగలవా అక్కా?” అని మరో ప్రశ్న సందిస్తున్నారు!

దీంతో… చేతిలో ఉన్న అవకాశాలు గాలికొదిలేసి… పార్లమెంటులో బిల్లు గురించి దీక్షలు చేయడం కంటే ముందు.. తమ పార్టీ ఆచరించి, అనంతరం ఇతరులకు సూచిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు! ఇప్పటికైనా ముగుసిపోయిందేమీ లేదు… ఈ ఏడాదిలో జరగబోయే ఎన్నికల్లో బీఆరెస్స్ 33% సీట్లు మహిళలలే ఇస్తున్నామని కేసీఆర్ తో ఒక ప్రకటన ఇప్పించినా చాలు… కవిత చిత్తిశుద్ధికి నూటికి నూరు మార్కులు పడినట్లేనని అంటున్నారు.

మరి కవితక్క ఈ విషయాలపై ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి!! ఏది ఏమైనా.. తెలంగాణ మహిళలు సందిస్తున్న ప్రశ్నల్లో న్యాయం ఉందనేది – యావత్ తెలంగాణ ప్రజల మాట!!