మునుగోడును మరో అమెరికా చేస్తా.. నేతల హామీలు మామూలుగా లేవుగా?

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మునుగోడు ఉపఎన్నిక ప్రస్తుతం హాట్ టాపిక్ అయిందనే సంగతి తెలిసిందే. ప్రజాశాంతి పార్టీ తరపున కేఏ పాల్ నామినేషన్ వేయగా ఆ నామినేషన్ తిరస్కరణకు గురైంది. అయితే స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్ వల్ల ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే కేఏ పాల్ ఏకంగా రాజగోపాల్ రెడ్డి తనకు మద్దతు ఇస్తే 60 నెలల్లో ఎవరూ చేయని స్థాయి అభివృద్ధిని ఆరు నెలల్లో చేసి చూపిస్తానని చెప్పుకొచ్చారు.

తనను మునుగోడులో గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఇతర పార్టీలు డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేస్తున్నాయని కేఏ పాల్ విమర్శలు చేశారు. మునుగోడును మరో అమెరికా చేస్తానని ఒకప్పుడు అడవిలా ఉన్న హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానేనని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. తనను ఎన్నికల్లో గెలిపిస్తే ఆరు నెలల్లో ఏడువేల ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆయన అన్నారు.

కులగజ్జి, కుట్రలు, కుతంత్రాలు పోవాలంటే తమ పార్టీనే గెలిపించాలని కేఏ పాల్ కామెంట్లు చేయడం గమనార్హం. మునుగోడు ఉపఎన్నికలో గెలవడానికి అభ్యర్థులు ఇస్తున్న హామీలను విని షాకవ్వడం ప్రజల వంతవుతోంది. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా కృషి చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు ధీటుగా ఖర్చు చేసే విషయంలో వెనుకడుగు వేస్తోంది. కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కడం కూడా కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ డబ్బు ఖర్చు చేయలేకపోయినా ప్రజలు తమ పార్టీనే గెలిపిస్తారని నమ్మకం కలిగి ఉంది. కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా ఖర్చు చేస్తుండగా ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నికలో పోటీ బీజేపీ, టీ.ఆర్.ఎస్ మధ్యే ఉండనుంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ పరువు నిలబడుతుందో ఏ పార్టీ పరువు పోతుందో చూడాల్సి ఉంది.