“జర్నలిస్టుల సమస్యలపై చర్యలు చేపట్టండి” ఉప రాష్ట్రపతి

తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఉప రాష్ట్రపతి సచివాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ తెలిపారు . రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్లలో 224 మంది జర్నలిస్టులు ఆకస్మిక మరణాలకు గురికావడంతో , తమ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ పోరాటం కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) సెప్టెంబర్ 4న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిందని . అదే రోజు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడును టీయుడబ్ల్యుజె, ఐజేయు ప్రతినిధి బృందం కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రాన్ని ఇచ్చినట్టు ఆయన చెప్పారు . దీనిపై ఉప రాష్ట్రపతి స్పందించి సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారని విరాహత్ అలీ తెలిపారు .

దీనిపై స్పందించిన ఉప రాష్ట్రపతి సచివాలయం కార్యదర్శి హుర్బి షకీల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సెప్టెంబర్ 10న అధికారికంగా లేఖ పంపించారని ఐజేయు, టీయుడబ్ల్యుజె ప్రతినిధి బృందం ఉప రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లిన సమస్యల వినతిపత్రాన్ని కూడా లేఖతో పాటు పంపిస్తూ తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారని , అంతేకాకుండా ఎలాంటి చర్యలు చేపట్టారో? టీయుడబ్ల్యుజె యూనియన్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారని , ఉప రాష్ట్రపతి సచివాలయం నుండి సదరు లేఖ కాపీ ఈరోజు టీయుడబ్ల్యుజె కార్యాలయానికి చేరిందని కె.విరాహత్ అలీ తెలిపారు