Allu Arjun: అల్లు అర్జున్ కు అండగా జనసేన నేత… కర్మ ఎవరిని వదిలిపెట్టదంటూ కామెంట్స్?

Allu Arjun: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అరెస్టు కావడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. ఇక ఈ విధానం కాస్త పొలిటికల్ పరంగా యూటర్న్ తీసుకొని పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది. ఇప్పటికే ఎంతోమంది తెలంగాణ రాజకీయ నాయకులు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. అయితే ఏపీలో కొంతమంది నాయకులు అల్లు అర్జున్ కు మద్దతుగా మాట్లాడారు.

ఇక జనసేన నేతలు ఎవరూ కూడా ఈ విషయంపై స్పందించిన దాఖలాలు లేవు అయితే తాజాగా జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కు మద్దతు తెలియజేశారు.అల్లు అర్జున్ కేసుపై బొలిశెట్టి సత్యనారాయణ స్పందిస్తూ.. కేసు నమోదు చేసి, సమాచారాన్ని సేకరించి, నిందితుడిని కోర్టుకు సమర్పించడం ప్రభుత్వ పని అని, ఆ తర్వాత న్యాయమూర్తి రికార్డులో ఉన్న వాస్తవాల ప్రకారం నిర్ణయించి శిక్షిస్తారన్నారు.కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ ఆయనని ఒక హంతకుడిలా చిత్రీకరించారు అంటూ రేవంత్ తీరుపై మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు దాదాపు 22 మరణాల వరకు జరుగుతున్నాయని వాటిపై దృష్టి పెట్టాలని తెలిపారు.అలాగే అసెంబ్లీలో ఆ మరణాలపై చర్చించాలని బొలిశెట్టి సలహా ఇచ్చారు. తెలుగు ప్రజలకు, భారతీయ సినిమాకు చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తిని సత్కరించే బదులు చిత్రహింసలు పెట్టి.. ఫోర్జరీ కేసు పెట్టి విచారణ అధికారులను తమ పని చేయకుండా తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారని ఫైర్ అయ్యారు.

గతంలో ఏపీలో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పట్ల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు.వారి పనులు, చేష్టల ప్రకారం బాధ పడక తప్పదన్నారు. జగన్ రెడ్డి లాగా రేవంత్ రెడ్డికి కూడా తగిన శిక్ష పడుతుందని ముగించారు.