మళ్లీ రాములమ్మ సైలెంట్? రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టే ఇక? సెకండ్ ఇన్నింగ్స్ షురూ..!

is vijayashanthi political career over?

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికల పూర్తయినా.. ఓవైపు గ్రేటర్ ఎన్నికలు.. మరోవైపు పట్టభద్రుల ఎన్నికలు జరగనున్నాయి. వాటితో పాటుగా దుబ్బాక ఉపఎన్నిక పోరు జరగనుంది. దీంతో తెలంగాణలో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణమే నెలకొన్నది.

వీటన్నింటి కంటే దుబ్బాక ఉపఎన్నికలో గెలుపు కోసం అన్ని పార్టీలు ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నాయి. అధికార పార్టీకి ఇది పరువు సమస్య. అధికారంలో ఉండి.. సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని గెలిపించుకోలేకపోతే పార్టీ పరువవు బజారున పడుతుంది. అందుకే.. అధికార టీఆర్ఎస్ పార్టీ… ముఖ్యమైన నేతలందరినీ దుబ్బాకలో దించేసింది. ప్రచారం ముమ్మరంగా సాగుతోంది కూడా. సీఎం కేసీఆర్ తెలంగాణ సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలు, దుబ్బాక అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

is vijayashanthi political career over?
is vijayashanthi political career over?

మరోవైపు బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీ చేస్తుండగా… దుబ్బాకలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అక్కడే మకాం వేశారు. దుబ్బాక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.

ఇక.. ఈ పార్టీలో గెలవడం కాంగ్రెస్ పార్టీకి కూడా ఎంతో అవసరం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బతికే ఉందని చెప్పుకోవడానికి ఈ ఎన్నికల్లో గెలవాలన్న కసితో కాంగ్రెస్ ఉంది. మొదటి నుంచి దుబ్బాక ఉప ఎన్నికపై ఎక్కువగా వార్తల్లో నిలిచింది కాంగ్రెస్ పార్టీనే. ఎందుకంటే.. ఈ సీటు గెలవాలని.. కాంగ్రెస్ పార్టీ ముందుగా.. తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతిని రంగంలోకి దించాలనుకున్నారు. విజయశాంతి కూడా దుబ్బాకలో పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. కానీ.. ఇప్పటికే రెండు సార్లు మెదక్ జిల్లాలో పోటీ చేసి ఓడిపోయిన విజయశాంతికి టికెట్ ఇస్తే.. ఖచ్చితంగా మరోసారి ఓడిపోవడం ఖాయం అని కాంగ్రెస్ నేతలు హైకమాండ్ కు వివరించారట. దీంతో విజయశాంతికి దుబ్బాక టికెట్ దక్కలేదు. ఈ విషయం విజయశాంతికి తెలియడంతో.. విజయశాంతి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారట.

ఈ ఎన్నిక కోసం కాంగ్రెస్ ముఖ్యనేతలంతా దుబ్బాకలో మకాం వేసినా… విజయశాంతి మాత్రం మచ్చుకు కూడా కనిపించడం లేదు. కనీసం ఎన్నికల ప్రచారంలోనూ ఆమె పాల్గొనడం లేదు. గత ఎన్నికల్లో అన్నీ తానై స్టార్ క్యాంపెయినర్ గా రాష్ట్రమంతా ప్రచారం చేసిన విజయశాంతి… ఈసారి దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో కనిపించకపోవడంతో.. ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారని అర్థం అవుతోంది.

దీన్ని బట్టి చూస్తే.. రాములమ్మ.. ఇక తన రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనూ ఆమె కాంగ్రెస్, టీడీపీ పొత్తును వ్యతిరేకించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయాక.. ఆమె పార్టీ విషయాల్లో అంటీముట్టనట్టుగానే ఉన్నారు. తాజాగా దుబ్బాక టికెట్ కూడా తనకు రాకపోవడంతో… రాములమ్మ ఇక తన రాజకీయ జీవితానికి పుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారట.

అయితే.. సినీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. అక్కడే సెటిల్ అయిపోవాలని విజయశాంతి భావిస్తోందట. సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. ఇక రాజకీయాల వైపు తిరిగి చూడకూడదని ఆమె డిసైడ్ అయ్యారట. ఇప్పటికే ఆమె సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తనకు టాలీవుడ్ లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. అందుకే.. టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి… రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టేయాలని ఆమె యోచిస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్ లో చర్చ సాగుతోంది. కానీ.. దీనిపై అధికారికంగా విజయశాంతి నుంచి ప్రకటన వస్తేనే ఏ విషయం అనేది తేలనుంది.