రైతు బంధు జమ కాలేదా.. తెలంగాణ రైతులు ఈ స్కీమ్ ను ఎలా పొందాలంటే?

తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో అత్యంత పాపులర్ స్కీమ్ ఏదనే ప్రశ్నకు రైతు బంధు స్కీమ్ పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరిన సంగతి తెలిసిందే. మూడు వారాల క్రితం తెలంగాణ సర్కార్ రైతు బంధు డబ్బులను రైతులకు జమ చేయడం జరిగింది. తక్కువ భూమి ఉన్నవాళ్ల నుంచి ఎక్కువ భూమి ఉన్నవాళ్ల వరకు అందరూ ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందుతున్నారు.

ఏదైనా కారణం వల్ల రైతుల ఖాతాలలో ఈ డబ్బులు జమ కాని పక్షంలో వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించడం ద్వారా రైతులు ఈ సమస్యను పరిష్కరించుకునే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ రైతులు ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందాలంటే ఈ విధంగా చేయకతప్పదు. 2018 సంవత్సరం నుంచి తెలంగాణ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం.

తెలంగాణ సర్కార్ ఏకంగా 7500 కోట్ల రూపాయలను ఈ స్కీమ్ కోసం ఖర్చు చేస్తోంది. వారసత్వ భూమిని తమ పేర్లపై నమోదు చేయించుకున్న వాళ్లతో పాటు కొత్తగా భూములను కొనుగొలు చేసిన వాళ్లు సైతం ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్ వల్ల రైతులకు పెట్టుబడి సాయం అందుతోంది. పేదలు, ధనికులు అనే తారతమ్యాలు లేకుండా ఈ స్కీమ్ అమలు జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో ఈ స్కీమ్ ఎన్నికల్లో గెలిపిస్తుందని తెలంగాణ సర్కార్ భావిస్తుండగా ఏం జరగనుందో చూడాల్సి ఉంది. కేసీఆర్ సర్కార్ కు గట్టి పోటీ ఇచ్చే విషయంలో కాంగ్రెస్, బీజేపీ తడబడుతున్నాయి. అందువల్ల 2024 ఎన్నికల్లో కూడా కేసీఆర్ సీఎం అయ్యి అరుదైన రికార్డును సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.