దాదాపు 129 మంది తెలుగు ‘విద్యార్థు’లను అమెరికా అరెస్టు చేయడంతో భారత్ ఇండియాల మధ్య డిప్లొమాటిక్ రచ్చ మొదలయింది. అరెస్టయిన వారు అమాయక విద్యార్థులనr,వారు తెలుగు రిక్రూటర్స్(8 మంది) చేతిలో మోసపోయారని, బ్రోకర్లలాా విద్యార్థులను చూడరాదని భారత్ నిరసన (demarche) తెలిపింది.అయితే, అమెరికా అధికారులతో ఈ వాదనతో ఏకీభవించడం లేదు. వాళ్లెవరూ విద్యార్థులు కాదని, తాము చేరుతున్నది ఫేక్ యూనివర్శిటి అని, అందులో తరగతులు లేవు,ఫాకల్టీ లేదని వారికి తెలుసని వాళ్లంతా వర్క్ ఆథరైజేషన్ కోసం క్యాంపస్ కూడా లేని యూనివర్శిటీలో చేరారని అమెరికా వాదిస్తున్నది. వాళ్ల ఉద్దేశమంతా అమెరికాలో స్థిరపడటమేనని అమెరికా అధికారులు వాదిస్తున్నారు.
ఈ కేసులను మానిటర్ చేసేందుకు భారత ప్రభుత్వం అమెరికాలో ఉన్న భారత రాయభార కార్యాలయంతో హాట్ లైన్ ఏర్పాటు చేసింది. విద్యార్థులతో సంప్రదింపులు జరిపేందుకు అమెరికాలో ఒక దౌత్యాధికారిని కూడా నియమించింది. సొంతంగా న్యాయసలహాదారులను సంప్రదిస్తూ ఉంది. అమెరికాలోని తెలుగు సంఘాలను, తెలుగు అటార్నీలను కూడా రంగంలోకి దించింది. అయితే, అమెరికా ఒకటే వాదనతో ఉంది. ఇదంతా పెద్ద కుట్ర అని అంటున్నది,
వందమందికి పైగా భారతీయ విద్యార్థులను (మొత్తం తెలుగువారే) అరెస్టు చేయడం పట్ల భారత్ నిన్న నిరసన లేఖరాసింది. వారందరిని ‘బాధితులు’ గా పేర్కొంది. అంతేకాదు, వాళ్లంతా బ్రోకర్ల మాయలోపడి మోసపోాయారని, బ్రోకర్లలాగే వారిని చూసేందుకువీల్లేదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
భారత్ వాదనతో అమెరికా ఏకీభవించడం లేదు. వీళ్లందరికి తామే ఏమిచేయబోతున్నామో తెలుసని పేర్కొంది.
రెండు దేశాల మధ్య ఇంతగా డిప్లొమాటిక్ రచ్చ ఇటీవల జరగలేదని టైమ్స్ ఆప్ ఇండియా వ్యాఖ్యానించింది.
ఇకపోతే, ఎనిమిది మంది బ్రోకర్లు మీద అమెరికా కుట్రకేసులు పెట్టింది. వారందరని దేశంలోని వివిధ ప్రాంతాల జైళ్లలో పెట్టారు. ఈ ఎనిమిది మందిలో అయిదుగురు తెలంగాణ వాళ్లయితే, ముగ్గురు ఆంధ్రప్రదేశ్ చెందిన వారు. దక్కన్ క్రానికల్ రిపోర్టు ప్రకారం వాళ్లంతా విద్యార్థుల నుంచి, యూనివర్శిటీ (ఫేక్ ) నుంచి కూడా డబ్బువసూలు చేశారు. యూనివర్శటీ యే వారికి 3,00,000 అమెరికన్ డాలర్లు (రు. 2.1 కోట్లు) వసూలు చేశారు. ‘విద్యార్థు’ల నుంచి ఎంతవసూలు చేసింది వివరాలు అందడం లేదు.
ఈ ఎనిమిది మందిన సోమవారం నాడు కోర్టు ముందు ప్రవేశపెడుతున్నారు. ‘విద్యార్థు’లుగా అరెస్టయిన వారందరిని భారత్ తిప్పిపంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది. దొంగమార్గంలో అమెరికాలో ఉద్యోగం సంపాదించి స్థిరడేందుకు చేసిన ప్రయత్నం వల్ల వీళ్లంతా భారీగా నష్టపోతున్నారు.