అమెరికాలో ఫేక్ యూనివర్శిటీ (University of Farmington)లో అమాయకులైన విద్యార్థులను చేర్పించి మోసం చేస్తున్న తెలుగు గ్యాంగ్ బాధితులను ఆదుకునేందుకు చర్యలు మొదలయ్యాయి. బాధితులకు కాన్సులార్ యాక్సెస్ ఇవ్వాలని భారత ప్రభుత్వం అమెరికాను కోరింది. ఈ లోపు ఆమెరికాలోని తెలుగు అసోసియేషన్లు కూడా రంగంలోకి దిగాయి. అమెరికా తెలుగు ప్రముఖులు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారుల అదుపులో ఉన్న విద్యార్థులతో మాట్లాడారు. పోలీసుల అదుపులో ఉన్నపుడు ఎలాంటిహాని జరగదని, వారిని అధికారులు బాాగా చూస్తారని వారితో మాట్లాడిన ఇమిగ్రేషన్ లాయర్లు విజయ్ ఎల్లారెడ్డి, సంతోష్ రెడ్డి సోమిరెడ్డి ధైర్యం చెప్పారు. ఇదే విధంగా ఇండియాలో ఉన్న వారి తల్లితండ్రులు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అరెస్టయిన వివరాలు తెలుసుకోవాలంటే http://locator.ice.gov/ వైబ్ సైట్ కు వెళ్లి తెలుసుకోవచ్చని వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదే పత్రికా ప్రకటన