హైదరాబాద్ మెట్రో రెండో దిశలో పరుగులు పెట్టబోతున్నది. సెప్టెంబర్ 24 వ తేదీన ఎల్ బినగర్-అమీర్ పేట మార్గంలో నడిచే మెట్రో రైలును గవర్నర్ ఇఎస్ ఎల్ నరసింహన్ ప్రారంభిస్తారు. ఈరోజు మునిసిపల్ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు రాజ్ భవన్ లో ఇవాళ గవర్నర్ నరసింహన్ ను కలుకుని మెట్రో రెండో రూట్ ను ప్రారంభించాలని కోరారు.
ఈ మార్గంలో పనులన్నీ పూర్తయ్యాయి. అందువల్ల ఈ నెల 24న మధ్నాహ్నం 12.15 నిమిషాలకు ఈ దిశ మెట్రో రైలుప్రారంభానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఎల్ బి నగర్- అమీర్ పేట రుూట్ హైదరాబాద్ లో అత్యంత రద్దీ రూట్. ఈ రూట్ లో ప్రయాణించేవారి సంఖ్య ఇతర మార్గాలలలో ముఖ్యంగా నాగోల్ అమీర్ పేటలో పోలిస్తే చాలా చాలా ఎక్కువ. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఈ రూట్ లో మెట్రో మొదలు కావడం నగరవాసులకు నిజంగా శుభవార్తే. (ఫోటో కర్టసీ హైదరాబాద్ మెట్రో)
Happy to announce that Hon’ble Governor Sri ESL Narasimhan Garu has consented to flag off the Ameerpet – LB Nagar metro line on 24th Sep at 12:15pm#HyderabadMetro pic.twitter.com/TsbA1tQGHE
— KTR (@KTRTRS) September 19, 2018