రౌండ్ రౌండ్ కు ఉత్కంఠ.. మునుగోడులో వార్ వన్ సైడ్ కాదు కదా?

మునుగోడు ఉపఎన్నిక బీజేపీ కోరి తెచ్చుకున్న ఎన్నికే అయినా గెలుపు కోసం అన్ని పార్టీల నేతలు పడిన కష్టం అంతాఇంతా కాదు. మొదట బీజేపీకే అనుకూలంగా ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నా దొరికిన ఏ అవకాశాన్ని వదలకుండా తెరాస అడుగులు వేయడం ఆ పార్టీకి ప్లస్ అయింది. మునుగోడులో వార్ వన్ సైడ్ అని ప్రచారం జరిగినా ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా ఓట్లు సాధిస్తుండగా తెరాస, బీజేపీలలో ఏ పార్టీ గెలుస్తుందో అంచనా వేయడం ఎవరి తరం కావడం లేదు. రౌండ్ రౌండ్ కు ఆధిక్యం మారుతుండటంతో ఎన్నికల ఫలితం ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందో చెప్పలేమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణ ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో ఎన్నికల ఫలితాలను అప్ డేట్ చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గ్రామంలో సైతం బీజేజీ ఆధిక్యం సాధించడం గమనార్హం. ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎక్కువమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి ఇన్ ఛార్జ్ లుగా ఉన్న గ్రామాల్లో సైతం బీజేపీ ముందంజలో ఉంది. మునుగోడు ఉపఎన్నిక ఫలితం ఏ పార్టీకి అనుకూలంగా వస్తుందో చూడాలి.

మునుగోడు ఉపఎన్నిక మద్యం బడ్జెట్ ఏకంగా 300 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. ఈ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు ఖర్చు చేయగా రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా ఫలితం వెలువడితే పార్టీలో ఆయన ఇమేజ్ ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.