విజయవాడ నుండి నందిగామ టిడిపి హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ మధిర వెళ్తున్నారు.
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రమయ్యాక రాష్ట్రంలో కాలుమోపుతున్న తొలి ఆంధ్రా టిడిపి నాయకుడు బాలయ్యే.
రాష్ట్రం ఏర్పడ్డాక మరీ ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ ఎంసి ఎన్నికలకలో టిడిపి పరాభవం పాలయ్యాక టిడిపి అధినాయకులు తెలంగాణ పర్యటనలను మ ానేశారు.
అమరావతి నుంచి రెగ్యులర్ గా హైదరాబాద్ వస్తున్నా వారి పర్యటనలు, సమావేశాలు ఎన్టీయార్ ట్రస్టు భవన్ దాటి రాలేదు. జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లకేష్ బాబు ఒక్కసారి కూడా రాష్ట్రంలో పర్యటించలేదు. కారణం, అంధ్రా పార్టీ అని కెసియార్ బాగా ఆ పార్టీని అపకీర్తి పాలు చేశారు. ఆ తర్వాత వాళ్లు తెలంగాణ పర్యటనలు మానేశాక, టిడిపి పార్టీ ఎక్కడుంది, ఫినిష్ అయిందనే ప్రచారం మొదలుపెట్టారు. దానికి తో డు వోటుకు నోటు తర్వాత రాజధాని ని రాత్రికి రాత్రి విజయవాడకు మార్చడంతో చంద్రబాబు పారిపోయాడన్నారు. అందువల్ల తెలంగాణ పర్యటించేందుకు టిడిపి అధినాయకత్వం ఆసక్తిచూపలేదు. ఈ నిరాసక్తత ఎంతవరకు పోయిందంటే, పార్టీని లోకల్ నాయకులకు వదిలేశామని చెప్పాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో టిడిపి కాంగ్రెస్ తో పొత్తు పెట్టకుంటున్నది. తర్వాత ఎవరో ఒకరు రాష్ట్రంలో పర్యటించాలి. అన్నివిధాల తగినవాడు, సినిమాయాక్టర్ బాలయ్య. అందుకే ఎన్టీయార్ విగ్రహావిష్కరణలతో పేరుతో టెస్ట్ పర్యటన మీద బాలయ్య మధిరకు పంపిస్తున్నారని టాక్.
ఈ పర్యటన రెస్పాన్స్ ను బట్టి బాలయ్యను టిడిపి తరఫున స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణలో సుడిగాలి పర్యటనలకు పంపవచ్చు.
చాలా మంది తెలంగాణ తెలుగుదేశం నేతలు జూనియర్ ఎన్టీయార్ ను స్టార్ క్యాంపెయినర్ చేయాలని డిమాండ్ చేస్తున్నా అది ఆచరణ సాధ్యంకాదని తెలిసింది.
ఈ రోజు ఆయనకు నందిగామ మధిర రోడ్డు వద్ద నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయన కూడా కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
మాగల్లు లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు కూడా చేశారు.
మధిర మండలం రాయపట్నం గ్రామానికి చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
మధిర టౌన్ లో కాసేపు ఆగి దెందుకురు గ్రామానికి చేరుకుని నూతనంగా ఏర్పాటు చేసిన బారీ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఆ తరువాత జిలుగుమడు గ్రామంలో ఆగుతారు మధిర ముగిసిన అనంతరం బోనకల్ మండలం నారాయణ పురం ఆళ్లపాడు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించి వైరా మీదుగా సత్తుపల్లి నియోజకవర్గ పర్యటన లో పాల్గొంటారు.