మనలో చాలామంది రేషన్ కార్డ్ ను కలిగి ఉంటారు. రేషన్ కార్డ్ ఉంటే మాత్రమే ఎన్నో పథకాల బెనిఫిట్స్ ను పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో రేషన్ కార్డ్ జిరాక్స్ ను జత చేస్తే మాత్రమే కొన్ని స్కీమ్స్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. అతి ముఖ్యమైన కార్డులలో రేషన్ కార్డ్ ఒకటి కాగా రేషన్ కార్డ్ ను పోగొట్టుకుంటే మాత్రం ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు.
ఏదైనా కారణం వల్ల రేషన్ కార్డ్ ను పోగొట్టుకున్నా సులువుగానే కొత్త కార్డ్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఏపీ ప్రజలలో ఎవరైనా రేషన్ కార్డ్ ను పోగొట్టుకుంటే వాలంటీర్లకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వాలంటీర్ల ద్వారా కొత్త రేషన్ కార్డ్ ను పొందవచ్చు. వేగంగా రేషన్ కార్డ్ ను పొందాలని అనుకుంటే మాత్రం సమీపంలోని గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులను సంప్రదించడం ద్వారా కొత్త రేషన్ కార్డును పొందవచ్చు.
తెలంగాణ ప్రజలు మాత్రం రేషన్ కార్డును పోగొట్టుకుంటే సమీపంలోని తహశీల్దార్ ఆఫీస్ ను సంప్రదించాల్సి ఉంటుంది. తహశీల్దార్ కార్యాలయంలో సంప్రదించి డూప్లికేట్ రేషన్ కార్డ్ ను అయితే సులువుగా పొందే అవకాశం అయితే ఉంటుంది. రేషన్ కార్డ్ లో మార్పులు చేర్పులు కోరుకునే వాళ్లు సైతం సమీపంలోని తహశీల్దార్ కార్యాలయంను సంప్రదించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు సబ్సిడీ ధరకే సరుకులు పొందే అవకాశం అయితే ఉంటుంది. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు రేషన్ కార్డ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. అర్హతలు ఉండి రేషన్ కార్డ్ లేనివాళ్లు సైతం తహశీల్దార్ కార్యాలయం నుంచి కొత్త రేషన్ కార్డ్ ను పొందే అవకాశం ఉంటుంది.
