తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ నిరుద్యోగులకు టిఎస్ పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ప్రకటించిన గ్రూప్ 4 నోటిఫికేషన్ పోస్టులకు అదనంగా మరో 74 పోస్టులను చేరుస్తూ టిఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 1521 గ్రూప్ 4 పోస్టులకు టిఎస్ పీఎస్సీ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. 

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 44, ఎస్సీ అభివృద్ది శాఖలో 30 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా నిర్ణయంతో రిక్రూట్ మెంట్ జరగనున్న గ్రూప్ 4 పోస్టుల సంఖ్య 1595 కి చేరింది. పెంచిన పోస్టులు ఏ మాత్రం సరిపోవని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. గతంలో గ్రూప్ 4 నోటిఫికేషన్ కు అనుగుణంగా దరఖాస్తు చేసుకున్న వారందరూ అర్హూలేనని టిఎస్ పీఎస్సీ ప్రకటించింది. కొత్తగా ఇచ్చిన పోస్టులకు మళ్లీ దరఖాస్తు చేసుకునేది ఏం లేదని గతంలో అప్లై చేసుకున్న అభ్యర్దులందరూ అర్హులేనని కమిషన్ తెలిపింది.

ఈ విధానం పై నిరుద్యోగులు మండి పడుతున్నారు. కొత్తగా పెంచిన పోస్టులకు మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తే బాగుంటుందని కొందరూ, అవసరం లేదని కొందరూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 7న గ్రూప్ 4 రాత పరీక్ష జరగనుంది. ఇప్పటి వరకు మాత్రం హాల్ టికెట్స్ జారీ కాలేదు. ముందే హాల్ టికెట్స్ పెట్టడం వల్ల కొంత మంది అభ్యర్దులు మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నారనే ఉద్దేశ్యంతో వారం ముందుగా హాల్ టికెట్స్ పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కొన్ని పరీక్షలకు ముందే పరీక్ష తేదిని ప్రకటించినా సెంటర్ మాత్రం మూడు రోజుల ముందుగా మాత్రమే తెలుస్తది. టిఎస్ పీఎస్సీ కూడా ఆ విధానాన్ని ఫాలో అవుతున్నట్టుందని పలువురు నిరుద్యోగులు తెలిపారు.