నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో విద్యుత్ శాఖలో ఏకంగా 1601 జాబ్స్!

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 1601 ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఈ ఉద్యోగాలలో 1553 జూనియర్ లైన్ మేన్ పోస్టులు ఉండగా 48 అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. https://www.tssouthernpower.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో వరుసగా జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ అవుతుండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీగా బెనిఫిట్ కలగనుంది. విద్యుత్ శాఖలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలలో జాయిన్ అయితే మంచిదని చెప్పవచ్చు. భారీ వేతనం లభిస్తుండటంతో ఈ ఉద్యోగాలకు ఊహించని స్థాయిలో పోటీ నెలకొంది.

నిరుద్యోగులు వేగంగా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. గతేడాది ఈ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్ష జరగగా ఆ సమయంలో అక్రమాలు జరిగినట్టు వార్తలు వినిపించాయి. వైరల్ అయిన వార్తల వల్ల అప్పట్లో పరీక్షను రద్దు చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మళ్లీ పరీక్షలు జరగనున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది.

ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతూ ఉండటంతో నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతోంది. తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగే విధంగా తీసుకుంటున్న నిర్ణయాల గురించి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సర్కార్ రాబోయే రోజుల్లో మరిన్ని జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేయనుందని తెలుస్తోంది.