పది పాసైన వాళ్లకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండా 1266 ఉద్యోగ ఖాళీలు?

ఇండియా పోస్టాఫీస్‌ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఏపీలో 2480, తెలంగాణలో 1266 ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. గ్రామీణ్ డాక్ సేవక్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ హోదాలలో పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయల రేంజ్ లో వేతనం లభిస్తుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఫిబ్రవరి 16వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని తెలుస్తోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు రోజుకు 4 గంటలు విధులు ఉండగా అదే సమయంలో అందించే సేవల ఆధారంగా ప్రోత్సాహకాలు ఉంటాయి.

విధులు నిర్వహించడం కోసం ప్రభుత్వం కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ను సమకూర్చుతుంది. సైకిల్ తొక్కడం వచ్చిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. పదో తరగతి మెరిట్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 100 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

https://indiapostgdsonline.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనున్న నేపథ్యంలో నిరుద్యోగులకు ఎంతగానో బెనిఫిట్ కలగనుంది.