గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపధ్యంలో ఓటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ బల్దియా బాద్‌షా ఎవరో నిర్ణయించే ఎన్నికల పోలింగ్ మొదలవగా ఓటువేసేందుకు సామాన్యులతో పాటు ప్రముఖులు పోలింగ్ సెంటర్ల వద్ద క్యూలు కట్టారు. ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరిగింది.
తెలంగాణలో తమ పట్టు కొల్పోలేదని, టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ చెక్కుచెదరలేదని నిరూపించుకునేందుకు బల్డియా ఎన్నికల్ని సీరియస్‌గా తీసుకోగా, ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు ఊహించని షాక్ ఇచ్చినట్టే, హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించి కారు టైర్లు పంచర్ చేయాలని బీజేపీ బావిస్తోంది. అమీతుమీ తేల్చుకునే స్థాయిలో ఇరు పార్టీలు ప్రచార పర్వం సాగించాయి. మరి ఈ ఎన్నికల్లో నిలిచేది ఎవరు, గెలిచేది ఎవరు, తొకముడిచేది ఎవరు అనేద చూడాలి.
ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. ఎన్నికలు వస్తున్నాయంటే పలు సర్వేలు తెరపైకి వస్తాయి. అసెంబ్లీ ఎన్నికు అయినా, లోక్‌సభ ఎన్నికలు అయినా లోకల్ ఎన్నికలు అయినా పలు సంస్థలు ఎన్నికలకు ముదు ప్రీ పోల్ సర్వేలు విడుదల చేయడం కామన్ అయిపోయింది. ఈ క్రమంలో వచ్చిన ప్రీ పోల్ సర్వే ఒకటి సోషల్ మీడియలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. ఆ సర్వే ప్రకారం గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా మరోసారి కొనసాగుతోందని తెలుస్తోంది.
అయితే గత ఎన్నికల్లో సాధించిన 99 సీట్ల మార్క్ రాకపోయినా టీఆర్ఎస్‌కు ఈసారి 90 నుండి 95 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని ఏబీపీ సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. ఇక ఎంఐఎం 35 నుండి 45 డివిజన్లలో గెలిచే చాన్స్ ఉందని, అనేక అస్త్రాలతో బీజేపీ పెద్దలంతా అడుగుపెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేసినా బీజేపీకి 10 నుండి 15 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఆ సర్వే అంచనా వేసింది. ఇకపోతే కొన్ని సర్వేలు బీజేపీ అనుకూలంగా తీర్పులు ఇచ్చినా.. ఫైనల్‌గా హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో విజయభేరి మోగించి కేసీఆర్ తన పట్టు నిలుపుకోనున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.