ప్రస్తుత కాలంలో మోసపోయే వారే ఉంటే మోసం చేసే వాళ్ళు అధికంగా ఉంటారు. పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్న వారుకూడా డబ్బు కోసం పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు ఈ క్రమంలోనే ఇదివరకే ఎంతోమంది పెద్ద ఎత్తున చిట్టీలు వేసి లక్షల్లో డబ్బు మోసపోయిన వారు ఉన్నారు. నమ్మిన వారని భావించి కష్టపడి సంపాదించినది మొత్తం చీటీలు వేయగా ఆ డబ్బుతో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్న వారు ఉన్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
తాజాగా ఇలాంటి ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సంజయ్‌నగర్‌లో చీటీలు, వడ్డీల పేరుతో సింగరేణి విశ్రాంత కార్మికుడు స్థానికులు, పరిచయస్తుల దగ్గర డబ్బులు వసూలు చేశాడు.సింగరేణిలో విశ్రాంత కార్మికుడు కావడంతో చాలామంది ఆయనను నమ్మి పెద్ద ఎత్తున చిట్టి వేశారు. ఇక ఆయన దగ్గర చిట్టికి వచ్చిన డబ్బులను తిరిగి వడ్డీలకు ఇచ్చేవారు ఇలా సుమారు20 నుంచి 30 మంది దగ్గర ఏడు లక్షల వరకు డబ్బులు వసూలు చేసి రాత్రికి రాత్రే ఊరు వదిలి వెళ్ళిపోయాడు.
ఈ క్రమంలోనే చిట్టీలు వేసినటువంటి వారు నిందితుడికి ఫోన్ చేసి డబ్బు అడగగా తాను వ్యాపారాలలో పెట్టుబడి పెట్టి నష్టపోయానని కోర్టులో ఐపీ పిటిషన్ కూడా వేశానని వారికి సమాధానం చెబుతున్నాడు అయితే తన భార్య కూతురు శనివారం గుట్టు చప్పుడు కాకుండా ఊర్లోకి రావడంతో అది గమనించిన స్థానికులు వారిని చెట్టుకు కట్టేసి తమ డబ్బులు తమకు చెల్లించాలంటూ ఆందోళన చేశారు. అయితే ఇది తెలిసిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసుల సంఘటన స్థలానికి చేరుకొని వారికి కట్లు విప్పి సమస్యను అడిగి తెలుసుకున్నారు. భార్య పిల్లలు వ్యాపారాలలో నష్టం రావడం వల్ల ఐపి పెట్టామని చెప్పగా చిట్టీలు వేసిన వారు మాత్రం తమకు ఎలాంటి నోటీసులు రాలేదని మాకు న్యాయం జరగాలని డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.