మునుగోడు ఉపఎన్నికకు హైదరాబాద్ కు లింక్ ఇదే.. రిజల్ట్ డిసైడ్ చేసేది వాళ్లే?

తెలంగాణ ప్రజలలో చాలామంది మునుగోడు నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులు లక్కీ అని భావిస్తున్నారు. కొన్ని నెలల క్రితం వరకు ప్రజలకు పెద్దగా తెలియని మునుగోడు గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే మునుగోడులోని ప్రధాన పార్టీలలో ఒక్కో పార్టీ ఒక్కో రకం సమస్యను ఎదుర్కొంటోంది. టీ.ఆర్.ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విషయంలో చాలామంది టీ.ఆర్.ఎస్ నేతలు సంతృప్తితో లేరు.

బీజేపీ ఓటు బ్యాంక్ కష్టాలు మామూలుగా లేవు. స్థానికంగా బీజేపీపై ప్రజల్లో మంచి అభిప్రాయం లేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఉన్న గుర్తింపు వాళ్లను ఎన్నికల్లో గెలిపిస్తుందో లేదో చూడాల్సి ఉంది. మరో పార్టీ కాంగ్రెస్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఇతర పార్టీల స్థాయిలో గత ఎన్నికల్లో ఈమె ఇండిపెండెంట్ గా పోటీ చేసి 17,000కు పైగా ఓట్లను సొంతం చేసుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కడం కూడా సులువు కాదు.

మరోవైపు మునుగోడు భవితవ్యం హైదరాబాద్ లో ఉన్న మునుగోడు ఓటర్లపై ఆధారపడి ఉందని తెలుస్తోంది. మునుగోడుకు చెందిన 25,000 మంది ఓటర్లు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారని సమాచారం అందుతోంది. ఎల్బీ నగర్ లోనే ఏకంగా 8500 మంది ఉన్నారని తెలుస్తోంది . మునుగోడు ఉపఎన్నిక గెలుపు ఓటముల్లో ప్రధాన పాత్ర పోషించేది వీరేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్ లో ఉన్న మునుగోడు ఓటర్లు ఏ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు మునుగోడులోని చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఏ స్థాయిలో ఓట్లను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. స్వతంత్రులు, చిన్న పార్టీలను బుజ్జగించడానికి నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.