TG: కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు… రేవంత్ తగిన మూల్యం చెల్లించాల్సిందే: హరీష్ రావు

TG: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కనుక రేవంత్ రెడ్డికి అలాగే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల ఈయన నేషనల్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలకు చట్టం చుట్టమైందని ఈయన తెలిపారు.

ప్రస్తుతం సినీ నటుడు అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ ఒక మనిషి ప్రాణాలు పోతే కేసులు పెట్టకూడదా చనిపోయిన ఆ కుటుంబానికి న్యాయం జరగాలి కదా అంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అయితే ఆ రేవతి కుటుంబానిది మాత్రమే ప్రాణమా.. ఆమె మరణం నిజంగా బాధాకరం కానీ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 450 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వారందరిదీ ప్రాణం కాదా, గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని సుమారు 50 మంది వరకు విద్యార్థులు మరణించారు వారిది ప్రాణం కాదా.. నేతన్నలు ఆటో డ్రైవర్లు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారందరికీ ఒక్క రూపాయి అయినా నువ్వు ఎక్స్క్రీగ్రీషియా ప్రకటించావా అంటూ ప్రశ్నించారు.

ఇక స్వయాన నా చావుకు కారణం నీ తమ్ముడు అంటూ సర్పంచ్ సూసైడ్ నోట్ రాసి చనిపోతే నీ తమ్ముడిపై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. నీకు చట్టం చుట్టంగా మారిందా చట్టం అందరి విషయంలో ఒకేలా ఉండాలి కదా.. ఒక అల్లు అర్జున్ విషయంలో మాత్రమే చట్టం పనిచేస్తుందా అంటూ ప్రశ్నించారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలంతా రేవంత్‌తో ఫొటో దిగారు. వాళ్లే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారు.

గతంలో ఇలాంటి సంస్కృతి తెలంగాణలో ఎప్పుడూ లేదు. రాయలసీమ తరహా ఫ్యాక్షనిస్టు సంస్కృతిని తెలంగాణలో తెచ్చి రేవంత్ రెడ్డి లా అండ్ ఆర్డర్‌ను కుప్పకూలుస్తున్నడు. ఇలాంటి సంస్కృతిని తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం అస్సలు హర్షించదు. రేవంత్ రెడ్డి తన వ్యవహరి శైలి కారణంగా కాంగ్రెస్ పార్టీకి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.