కాంగ్రెస్ కు ఇక తెలంగాణ నుండి బ్యాగ్ సర్దుకోవాల్సిన సమయం వచ్చిందా ?

congress party utter flop in dubbaka elections

దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ చావు దెబ్బతినిందనే చెప్పాలి. ఒకరకంగా దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్ భవిష్యత్ ను కాలరాసిందనే చెప్పాలి. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమయింది. ఏ రౌండ్ లోనూ కాంగ్రెస్ ఆధిక్యత కనపర్చ లేదు.దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ ను ప్రజలు నమ్మకపోవడమే. టీఆర్ఎస్ ను తట్టుకుని ధీటుగా నిలబడేది బీజేపీ మాత్రమేనని ప్రజలు భావించారు. అందుకే కాంగ్రెస్ ఓటు బ్యాంకు సయితం బీజేపీ వైపు మళ్లిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. నిజానికి అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ మంచి స్ట్రాటజీనే అమలు చేసింది. మాజీ మంత్రి, దివంగత చెరకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డిని రంగంలోకి దించింది.

congress party utter flop in dubbaka elections
congress party utter flop in dubbaka elections

అంతవరకూ బాగానే ఉన్నప్పటికీ ప్రజలను తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ విఫలమయిందనే చెప్పాలి. ప్రచారంలోనూ లోపాలు కన్పించాయి. బీజేపీ టీఆర్ఎస్ కు అడ్డుకట్ట వేయాలని ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తే, కాంగ్రెస్ మాత్రం నామమాత్రంగా మిగిలిపోయింది. ఎన్నడూ లేని విధంగా మండలానికి ఒక నేతను బాధ్యుడిగా నియమించినప్పటికీ ఫలితం కన్పించలేదు. కనీసం కొన్ని చోట్ల పోటీ ఇచ్చిన దిక్కు లేకుండా పోయింది.

ఇన్నాళ్లూ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనంటూ చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఇక దానిని పక్కన పెట్టాల్సి వచ్చింది. బీజేపీ పుంజుకుంటుందనడానికి దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు ఆరేళ్ల నుంచి దానిని నిలబెట్టుకో లేక పోతుంది. ప్రజల్లో నమ్మకం కల్గించలేకపోతుంది. నాయకత్వ లేమితో కూనారిల్లి పోతున్న కాంగ్రెస్ పార్టీ ఇక తెలంగాణలో నిలదొక్కుకోవడం కష్టమేనని భావిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణలో కాంగ్రెస్ బలాన్ని చెప్పకనే చెప్పింది.