తెలంగాణ తెచ్చింది టిఆర్ఎస్సే : కాంగ్రెస్ నేత మనసులోమాట (వీడియో)

తెలంగాణ వచ్చి నాలుగేళ్లవుతున్నా కొన్ని ప్రశ్నలు జనాలను ఇంకా పీడిస్తూనే ఉన్నాయి. రాజకీయ నేతల గందరగోళ ప్రకటనల కారణంగా ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకు సరైన సమాధానం రాలేదు. తెలంగాణ ఇచ్చిందెవరు? తెలంగాణ తెచ్చిందెవరు? తెలంగాణ ఎట్లొచ్చింది? ఉద్యమాలతో తెలంగాణ వచ్చిందా? లాబీయింగ్ తో తెలంగాణ వచ్చిందా? కాంగ్రెస్ వల్ల తెలంగాణ వచ్చిందా? టిఆర్ఎస్ వల్ల తెలంగాణ వచ్చిందా? చంద్రబాబు లెటర్ ఇవ్వడంతోనే తెలంగాణ వచ్చిందా? జెఎసి ఉద్యమాల వల్ల తెలంగాణ వచ్చిందా? టిఆర్ఎస్ ఉద్యమాల వల్ల తెలంగాణ వచ్చిందా? సోనియాగాంధీ వల్ల తెలంగాణ వచ్చిందా? పార్లమెంటులో బిజెపి మద్దతు ఇవ్వడం వల్ల తెలంగాణ వచ్చిందా? ఇన్ని ప్రశ్నలకు ఎవరికి తోచినట్లు వారు సమాధానాలు చెప్పుకుంటున్నారు. జనాలకు మాత్రం అసలు వాస్తవాలు తెలియకుండా కన్ ఫ్యూజ్ చేస్తున్నారు.

కానీ జనాల్లో మాత్రం ఎవరి వల్ల తెలంగాణ వచ్చింది? ఉద్యమాలు చేసిందెవరు? తెలంగాణ సాధించిందెవరు? తెలంగాణ ఇచ్చిందెవరు అనే ప్రశ్నలకు ఎంత గందరగోళంలోకి నెట్టినా జనాల్లో మాత్రం క్లారిటీ ఉంది. తెలంగాణ నినాదాన్ని పతాక స్థాయికి తీసుకుపోయింది టిఆర్ఎస్ అనేది అందరూ చెప్పే మాట. తెలంగాణ కోసం మడమ తిప్పని పోరాటం చేసింది జెఎసి అనేది కూడా అందరి మదిలో ఉన్నమాట. ఇక తెలంగాణ ఇచ్చింది మాత్రం సోనియాగాంధీ అనేది జగమెరిగిన సత్యం. ఆమె సాహసోపేతమైన నిర్ణయం వల్లే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది అనేది కూడా జనాల చర్చల్లో ఉన్న ముచ్చట.

ఈ నేపథ్యంలో ఎవరి పాత్ర ఏమిటన్న విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు ఇంకా గుప్పించుకుంటూనే ఉన్నారు. తెలంగాణ రావడానికి ఏ ఒక్కరూ కారణం కాదన్నది కూడా అందరికి తెలిసిందే. అయితే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ తన నియోజకవర్గంలో జరిగిన ఒక సభలో మాట్లాడారు. ఆయన స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై విమర్శల వర్షం కురిపించారు. గువ్వల రౌడీ ఎమ్మెల్యే అంటూ పరుషమైన పదాలతో విమర్శలు గుప్పించారు.

అదే సమయంలో ఆయన తన మనసులోని మాటలను కూడా బయటపెట్టారు. తెలంగాణ కోసం టిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చెప్పకనే చెప్పారు. డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఉద్దేశపూర్వకంగా టిఆర్ఎస్ గురించి మాట్లాడకపోవచ్చు కానీ గతంలో జరిగిన పరిణామాలను ఆయన తన మాటల్లో వివరించారు.

వంశీ కృష్ణ ఏం మాట్లాడారో తెలంగాణ కోసం టిఆర్ఎస్ ఏం చేసిందో? కింద వీడియో ఉంది చూడండి. వీడియోలో 50 సెకన్ల నుంచి ఫాలో అయితే క్లారిటీ వస్తుంది చూడండి.

 

(ఫ్యూచర్డ్ ఇమేజ్… డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఫేస్ బుక్ అకౌంట్ వాల్ నుంచి తీసకున్నది.)