శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి నీళ్ళు వస్తుంటే చాలా సంతోషంగా ఉందని మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ తెలిపారు.. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ను సందర్శించిన ఆయన కెసిఆర్ ప్రభుత్వం ఫై మండిపడ్డారు. ఈ ప్రభుత్వం మొండి వైఖరితో రైతులు రోడ్ ఎక్కినా నీళ్ళు ఇవ్వకుండా అరెస్టులు చేసి జైలుపాలు చేసిందన్నారు. అయినా దేవుడు కరుని౦చి వర్షాలు కురిసి పంటలు బతికించాడని అన్నారు.
ప్రాజెక్ట్ ల్లోకి నీళ్ళు వస్తుంటే కాంగ్రెస్ వాళ్లకు కన్నీల్లు వస్తున్నాయని మంత్రి హరీష్ రావు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 15 టీ యమ్ సి ల నీరు ప్రాజెక్ట్ లో ఉండి కూడా మీ స్వార్థం కొరకు నీళ్ళు విడుదల చేయలేదని మండిపడ్డారు. వర్షకాలం లో మీ సిద్దిపేట తాగు నీరు కోసం, బాల్కొండ రైతుల కన్నీళ్ళు తెప్పించింది మీరు కాదా అని ప్రశ్నించారు.
బాల్కొండ చరిత్ర లో మహిళా రైతుల రోడ్ మీదకు రాలేదన్నారు. కానీ కేసిఆర్ హయాంలో మహిళా రైతులకి కన్నీళ్ళు తెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఉసురు తగిలి పోతావ్ హరిష్ రావు అని హెచ్చరించారు. బాల్కొండ రైతులు పనికి రాని మిషన్ భగీరథ మాకు అవసరం లేదంటున్నారని అన్నారు అనీల్.
తెలంగాణా ప్రజలను పీడించుకొని తింటున్నది టిఆర్ఎస్ వాళ్లే అన్నారు. నిజామాబాద్ నీళ్ళు ఈ జిల్లా కే చెందాలన్నారు. నేడు మీరు నీళ్ళు సిద్దిపేటకు, గజ్వేల్ కి తరలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిజామాబాదు ప్రజలు మిమ్మల్ని బొందపెట్టడం ఖాయమన్నారు.
అనీల్ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.